Begin typing your search above and press return to search.

కూతురితో ఫోటో.. అమిర్ పై నెటిజన్స్ ఫైర్

By:  Tupaki Desk   |   31 May 2018 10:30 AM GMT
కూతురితో ఫోటో.. అమిర్ పై నెటిజన్స్ ఫైర్
X
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చాలా కాలం తరువాత షూటింగ్ లకు బ్రేక్ చెప్పి కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నాడు. తన కజిన్ పుట్టిన రోజు సందర్బంగా లాంగ్ హాలిడేను ప్లాన్ చేసుకున్నాడు. ఇక ఎప్పటికప్పుడు తన కుటుంబ సభ్యులతో గడిపిన ఆనంద క్షణాలను కొన్ని ఫొటోల ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు. అయితే ఇటీవల అమిర్ ఖాన్ నుంచి వచ్చిన ఒక ఫొటో కాంట్రవర్షియల్ గా మారింది. అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

ఎందుకంటే.. అమిర్ ఖాన్ తన కూతురు ఇరా ఖాన్ తో సరదాగా ఆడుకుంటూ ఉన్న ఒక ఫొటోను పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలు అమిర్ పైన ఇరా కూర్చొని తండ్రితో ఫన్నీగా పోట్లాడుతోంది. అయితే ఈ హ్యాపీ మూమెంట్ పై కొందరు తప్పుబడుతున్నారు. వయోసచ్చినా ఆడపిల్లతో అమిర్ అలా సరదాగా చేసినప్పటికీ ఆ ఫొటో ఇంటర్నెట్ లోవిడుదల చేయాల్సింది కాదని అంటున్నారు. మరికొందరైతే రంజాన్ మాసంలో ఇరా ఖాన్ డ్రెస్ ఏంటి అలా ఉంది. ఎంత మంత్రం ఈ ఫోటో బాలేదని కొంతమంది ముస్లింలు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక అందరికి ఓ నెటిజన్ కౌంటర్ ఇచ్చాడు. కూతురు అయినందుకేనా అమిర్ ఖాన్ ను అలా అంటున్నారు. అతని కూతురిని అతను ఇష్టంగా చూసుకున్నా తప్పేనా? ఒకవేళ ఆ స్థానంలో అబ్బాయి ఉంటే బావుండేదా అని మండిపడ్డాడు. మరికొంత మంది అమిర్ ఫ్యాన్స్ కూడా అలానే కామెంట్ చేశారు. అయితే ఏదేమైనా అమిర్ ఖాన్ చాలా కాలం తరువాత సోషల్ మీడియాలో ఒక గట్టి కాంట్రవర్సీని ఎదుర్కోవాల్సి వచ్చింది.