Begin typing your search above and press return to search.
మిస్టర్ పర్ఫెక్ట్ లా మన హీరోలు చేయరేం?
By: Tupaki Desk | 11 May 2020 3:30 AM GMTఎక్కడ రచయితలు గౌరవించబడతారో అక్కడ వినోద పరిశ్రమలు అలరారుతాయి. దేవతలు తథాస్తు అని ధీవిస్తారు. అందుకు తగ్గట్టే క్రియేటివిటీ కొత్త పుంతలు తొక్కుతుంది. కథల్లో కొత్తదనం.. సినిమాల్లో రెట్టించిన వినోదం సాధ్యమవుతాయి. ఇలాంటి విషయాల్లో ఖాన్ ల త్రయంలోనే మేధావిగా పేరు తెచ్చుకున్నాడు మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్. అతడు ఓ కథను లేదా స్క్రిప్టును ఎంచుకుంటే అది సంచలన విజయం సాధించాల్సిందేనన్న ప్రశంస ఉంది. ఇతర ఖాన్ లకు సాధ్యం కానిది అమీర్ ఖాన్ కి మాత్రమే ఎలా సాధ్యమైంది? అంటే .. అక్కడే ఉంది లాజిక్. రచయితల్ని ఆయన గౌరవించే విధానమే అందుకు కారణం అని చెబుతుంటారు సన్నిహితులు.
ఇక ఇటీవలి కాలంలో ఖాన్ ల త్రయంలో సల్మాన్ ఖాన్ ఒకడుగు ముందుకేస్తే మరో అడుగు వెనకబడుతున్నాడు. ఒక ఫ్లాపు ఒక హిట్టు అన్నట్టుగా ఒడిదుడుకులు ఉన్నాయి. అలాగే కింగ్ ఖాన్ షారూక్ అయితే స్క్రిప్టు ఎంపికలోనే తడబడుతున్నాడు. కేవలం ఖాన్ లే కాదు సాహో లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలో నటించినా స్క్రిప్టు ఎంపికలో తడబాటు విషయంలో ప్రభాస్ పై తీవ్ర విమర్శలొచ్చాయి. అయితే అలా కాకుండా ఉండాలంటే స్క్రిప్టు రచయితల్ని కథా రచయితల్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.
మంచి స్క్రిప్టుల్ని ఒడిసిపట్టుకోవాలంటే అందుకు తగ్గట్టుగానే ప్రోత్సాహకాన్ని రచయితలకు ఇవ్వాలి. ఆమ్యామ్యా గౌరవప్రదంగా వెదజల్లాలి. ఈ విషయంలో మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కాస్త ముందే ఉంటాడని ప్రూవ్ అవుతోంది. స్క్రిప్ట్ రైటర్స్ కోసం ఆయన కొన్ని ప్రోత్సాహకర విధానాల్ని అనుసరిస్తూ నలుగురికి ఆదర్శమవుతున్నాడు. ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో స్క్రిప్ట్ రైటర్స్ మరింత ఉత్సాహంతో రాయడం కొనసాగించాలని అమీర్ ఖాన్ ఇప్పటికే కోరారు. `సినెస్టాన్ ఇండియా స్టోరీ టెల్లర్స్ స్క్రిప్ట్ కాంపిటీషన్` పేరుతో ఆయన బంపర్ బహుమతుల్ని అందిస్తున్నారు. ఈ ఏడాది రెండవ ఎడిషన్ విజేతలను అమీర్ ఖాన్- దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ .. సీనియర్ రచయితలు అంజుమ్ రాజబాలి -జూహి చతుర్వేది డిజిటల్ వేదికపై ప్రకటించారు. అనంతరం అమీర్ ఖాన్ మాట్లాడుతూ..లాక్ డౌన్ కారణంగా ఒక కార్యక్రమం చేసి వేదికపై అవార్డులను ప్రకటించలేమని అమీర్ విచారం వ్యక్తం చేశారు.
బహుమతుల గ్రహీతల్ని ఆయన స్వయంగా ప్రకటించారు. ``పోటీలో మొదటి ఐదు స్థానాల్లో చోటు దక్కించుకోని వారు నిరుత్సాహపడకూడదు. వాస్తవానికి.. స్క్రిప్ట్ రైటర్స్ మరింత ఉత్సాహంతో రాయడం కొనసాగించాలి. ముఖ్యంగా ఈ లాక్ డౌన్ కాలంలో. ప్రతి చిత్రనిర్మాతకు మంచి స్క్రిప్ట్ అవసరం`` అని అన్నారు. మొదటి బహుమతి గా రూ .25 లక్షలు అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన సెజల్ పచిసియా గెలుచుకుంది. `ఆన్ ది బౌండరీ` అనే కథకు జ్యూరీ సభ్యుల నుండి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. #CinestaanScriptContest - రూ .25 లక్షల మొదటి ప్రైజ్ సెజల్ పచిసియాకు `ఆన్ ది బౌండరీ` కోసం వెళ్లనుందని తెలిపారు.