Begin typing your search above and press return to search.

నాన్న క‌ష్టాలు చూసి ఏడ్చేశా: అమీర్ ఖాన్

By:  Tupaki Desk   |   5 Dec 2022 11:30 AM GMT
నాన్న క‌ష్టాలు చూసి ఏడ్చేశా: అమీర్ ఖాన్
X
బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తండ్రి తాహుర్ హుస్సేన్ వార‌స‌త్వంతో బాలీవుడ్ కి ఎంట్రీ న‌టుడిగా బాలీవుడ్ లో త‌న‌కంటూ కొన్ని పేజీల్ని రాసి పెట్టుకున్నారు. భార‌త‌దేశ‌మే గ‌ర్వించే గొప్ప న‌టుడిగా నీరాజ‌నాలు అందుకుంటున్నాడు. ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద నెంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న ఒకే ఒక్క‌డు అమీర్.

అమీర్ ఖాన్ సినిమా అంటే ఇండియన్ మార్కెట్ నే షేక్ చేస్తుంది. బాలీవుడ్ చ‌రిత్ర పుట్ట‌ల్లో ఎంత మంది లెజెండ్ లు ఉన్నా? అమీర్ స్థానం ఎంతోప్ర‌త్యేక మైన‌దిగానే భావించాలి. న‌టుడిగా..నిర్మాత‌గా..ద‌ర్శ‌కుడిగా అసాధార‌ణ ప్ర‌తిభ‌ను చాటుతూ దూసుకుపోతున్నారు. తాజాగా అమీర్ త‌న తండ్రి గురించి ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసి క‌న్నీళ్లు చెమ‌ర్చారు.

ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ..జితేంద్ర‌..రేఖ లాంటి పెద్ద న‌టుల డేట్లు కుద‌ర‌క‌పోవ‌డంతో నాన్నకి ఓ సినిమా పూర్తి చేయ‌డానికి ఎనిమిదేళ్లు స‌మ‌యం ప‌ట్టింది. అప్పులిచ్చిన వాళ్లు నాన్న‌ని నిల‌దీస్తుంటే ఆయ‌న ఎంతో ఓపిక‌గా బ్ర‌త‌మిలాడేవారు. అప్పుడు నేను ప‌దేళ్ల బాలుడిని. ఆ సంఘ‌ట‌న‌లు ఇప్ప‌టికీ నా క‌ళ్ల ముందు మొదులుతూనే ఉంటాయి.

ఏమీ చేయ‌లేక కుమిలిపో యేవాడిని. ఈరోజు నా ద‌గ్గ‌ర కోట్లు ఉండొచ్చు. కానీ ఆ నాడు పావ‌లా కూడా లేదు. అప్పుల వాళ్లు మీద ప‌డితే ఎలా ఉంటుంద‌న్నది ఆరోజే అర్ధ‌మైంది. అది నాన్న జీవితంలో బ్యాడ్ ఫేజ్. అలాంటి ప‌రిస్థితులు ఎవ‌రికీ రాకూడ‌ద ని కోరుకుంటున్నా' అని అన్నారు. మొత్తానికి ఇండ‌స్ర్టీ క‌ష్టాలు ఎలా ఉంటాయి అన్న‌ది అమీర్ ప‌దేళ్ల వ‌య‌సులోనే చూసేసారు.

అందుకేనేమో నిర్మాణ విష‌యంలో ఆచితూచి అడుగులు వేయాలి. పెట్టే ప్ర‌తీ రూపాయి ఎంతో విలువైన‌ది. వృద్ధా ఖ‌ర్చు వ‌ద్దు అని ఆ మ‌ధ్య ఇంట‌ర్వ్యూలో కూడా నిర్మాణంలో ఉండే సాధ‌క బాధ‌కాల్ని గుర్తు చేసుకున్నారు. ఇటీవ‌లే అమీర్ న‌టించిన 'లాల్ సింగ్ చ‌డ్డా' భారీ అంచనాల మ‌ధ్య రిలీజ్ అయి ఎలాంటి ఫ‌లితాలు సాధించిందో తెలిసిందే. దీంతో అమీర్ కొత్త సినిమా ప్రారంభించ‌డానికి లాంగ్ గ్యాప్ తీసుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.