Begin typing your search above and press return to search.
‘దంగల్’ను ఆ మైలురాయి ఊరిస్తోంది
By: Tupaki Desk | 7 Jun 2017 11:06 AM GMT‘బాహుబలి: ది కంక్లూజన్’ వెయ్యి కోట్ల గ్రాస్ సాధిస్తుందన్నది అందరూ ఊహించిన విషయమే. ఐతే ఆ సినిమా అంచనాల్ని మించిపోయి రెండు వారాల్లోనే రూ.1500 కోట్ల మైలురాయికి చేరువై సంచలనం సృష్టించింది. మూడో వీకెండ్లో కూడా ఆ సినిమా జోరు చూసి ఫుల్ రన్లో రూ.2 వేల కోట్ల మైలురాయికి చేరువగా వెళ్తుందేమో అనుకున్నారు. కానీ తర్వాత ఈ సినిమా జోరు తగ్గింది. ప్రస్తుతం రూ.1650 కోట్ల దాకా ఉన్నాయి బాహుబలి-2 వసూళ్లు. ఫుల్ రన్లో రూ.1700 కోట్లకు చేరువగా వెళ్లొచ్చేమో. ఐతే రూ.2 వేల కోట్ల మైలురాయి ‘బాహుబలి-2’కు అందుతుందా లేదా అన్నది ఆ చిత్రం చైనాలో ఎలా పెర్ఫామ్ చేస్తుందన్నదానిపై ఆధారపడి ఉంది. అక్కడ బాహుబలి-1 రూ.7 కోట్లు మాత్రమే వసూలు చేసిందన్న సంగతి తెలిసిందే.
ఐతే బాహుబలి-2 సంగతేమో కానీ.. అమీర్ సినిమా ‘దంగల్’ మాత్రం రూ.2 వేల కోట్ల మైలురాయిని అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. చైనాలో వసూళ్ల ప్రభంజనం కొనసాగిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే అక్కడ రూ.1100 కోట్ల మార్కుకు చేరువగా వెళ్లింది. వరల్డ్ వైడ్ వసూళ్లు రూ.1850 కోట్లను దాటాయి. చైనాలో నెల రోజుల తర్వాత కూడా ‘దంగల్’ నిలకడగా వసూళ్లు సాధిస్తుండటం.. అక్కడ జులై 4 వరకు సినిమాను ప్రదర్శించుకునేందుకు నెల రోజుల అదనపు గడువు ఇవ్వడంతో ‘దంగల్’ రూ.2 వేల కోట్ల మైలురాయిని ఈజీగానే దాటేసే అవకాశముంది. చైనాలో హాలీవుడ్ సినిమాల వసూళ్లను కూడా దాటేసి బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది ‘దంగల్’. ఫుల్ రన్లో ఈ సినిమా అక్కడ రూ.1500 కోట్ల మైలురాయిని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/