Begin typing your search above and press return to search.

ఆ సూపర్ స్టార్‌ మన స్టార్స్‌ ని తెగ వాడేస్తున్నాడుగా..!

By:  Tupaki Desk   |   25 July 2022 6:59 AM GMT
ఆ సూపర్ స్టార్‌ మన స్టార్స్‌ ని తెగ వాడేస్తున్నాడుగా..!
X
బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ ఆమీర్ ఖాన్‌ లాల్ సింగ్ చద్దా సినిమా సౌత్‌ లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలుగు స్టార్ నాగ చైతన్య ఈ సినిమా లో ఉండటంతో సహజంగానే తెలుగు ప్రేక్షకుల అటెన్షన్ ను దక్కించుకుంది. పైగా ఈ సినిమా ను చిరంజీవి సాధ్యం అయినంత ఎక్కువగా ప్రమోట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

చిరంజీవి సమర్పిస్తున్న ఈ సినిమా లో సౌత్ స్టార్‌ విజయ్‌ సేతుపతి కూడా ఉండటంతో తమిళ ఆడియన్స్ కూడా ఈ సినిమా పై అంచనాలు.. ఆసక్తి పెంచుకున్నారు.

తెలుగు లో ఈ సినిమా ను భారీ గా ప్రమోట్ చేయడం కోసం యూనిట్‌ సభ్యులను టాలీవుడ్‌ స్టార్‌ హీరో నాగార్జున ఇంటర్వ్యూ చేసినట్లుగా తెలుస్తోంది. ఆమీర్ ఖాన్.. చిరంజీవి మరియు నాగ చైతన్య లను నాగార్జున ఇంటర్వ్యూ చేశాడని సమాచారం అందుతోంది.

ఇంటర్వ్యూ రికార్డ్‌ చేయగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ఆ ఇంటర్వ్యూను తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. నాగ చైతన్య ను ఈ సినిమాలో నటింపజేయడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యేలా చేసిన అమీర్ ఖాన్ ఇప్పుడు చిరంజీవి తో సినిమా ను సమర్పింపజేస్తున్న నేపథ్యంలో మరింతగా సినిమా ను తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పుడు మరో టాలీవుడ్‌ స్టార్ అయిన నాగార్జునను కూడా లాల్‌ సింగ్‌ చద్దా సినిమా యొక్క ప్రమోషన్‌ లో ఇన్వాల్వ్‌ చేయడంతో ఆమీర్ ఖాన్ మరింతగా ప్రమోషన్ విషయంలో సక్సెస్ అయినట్లే అనిపిస్తుంది. మొత్తానికి మన స్టార్స్ ను ఆమీర్‌ ఖాన్‌ ఫుల్ గా వాడేసుకుంటూ తన లాల్‌ సింగ్‌ చద్దా సినిమా కు తెగ ప్రమోషన్ చేసేసుకుంటున్నాడు.

ఈ సినిమాలో ఆమీర్ ఖాన్ కు జోడీగా కరీనా కపూర్ ఖాన్‌ నటించింది. సినిమా లో ఆమీర్ ఖాన్‌ ఒక ప్రత్యేకమైన తరహా వ్యక్తిగా కనిపించబోతున్నాడు. ఆర్మీ జవాన్ పాత్రలో ఆమీర్‌ ఖాన్‌ ను చూడబోతున్నాం. నాగ చైతన్య కూడా ఆర్మీ జవాన్ గానే ప్రేక్షకులకు కనిపించబోతున్నాడు. ఈ సినిమా తో ఆమీర్ ఖాన్ బాలీవుడ్ కు మునుపటి ఊపు తీసుకు వస్తాడని అంతా ఎదురు చూస్తున్నారు. ఏం జరిగేనో చూడాలి.