Begin typing your search above and press return to search.

అమీర్ కూడా ఏడ్చేశాడట..

By:  Tupaki Desk   |   20 July 2015 4:22 PM IST
అమీర్ కూడా ఏడ్చేశాడట..
X
అమీర్ ఖాన్ కు తన సినిమాలతో ప్రేక్షకుల్ని ఏడిపించేయడం అలవాటే. ఐతే ఆయన్ని ఏడిపించే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఆ మధ్య మార్గరెట్ విత్ ఎ స్ట్రా అనే సినిమా చూసి ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు అమీర్. ఆ సినిమా చూస్తూ తన భర్త బోరున ఏడ్చేశాడని కిరణ్ రావు చెప్పడం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అమీర్ ని ఏడిపించే ఇంకో సినిమా వచ్చింది. అది సల్మాన్ ఖాన్ సినిమా ‘భజరంగి భాయిజాన్’ కావడం విశేషం. ఈసారి అమీర్ ఏడ్చిన విషయం వేరెవరో చెప్పలేదు. ‘భజరంగి భాయిజాన్’ చూస్తూ తాను ఏడ్చినట్లు అమీరే స్వయంగా వెల్లడించాడు.

ముంబయిలో భజరంగి భాయిజాన్ స్పెషల్ షోకు అమీర్ వచ్చాడు. సినిమా చూసి బయటికి చెమర్చిన కళ్లతో వచ్చిన అమీర్.. కర్చీఫ్ తో కళ్లు తుడుచుకుంటూ కనిపించాడు. ఆ సందర్భంగా మీడియాతో ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయిన అమీర్.. ఆ తర్వాత ట్విట్టర్లో సినిమా గురించి స్పందించాడు. ‘‘సినిమా చాలా బాగుంది. ఇప్పటివరకు సల్మాన్ నటించిన సినిమాల్లో ఇదే బెస్ట్. సల్మాన్ నటన అద్భుతం. అతను కన్నీళ్లు పెట్టించాడు. కథ, కథనం, డైలాగ్స్ చాలా బాగా కుదిరాయి. కబీర్ ఖాన్ చక్కటి సినిమా తీశాడు. అందరూ చూడదగ్గ సినిమా. చిన్నపాప హర్షాలీ మీ మనసులు దోచుకుంటుంది’’ అని ట్వీట్ చేశాడు అమీర్. మిస్టర్ పర్ఫెక్షనిస్టే ఇలా సర్టిఫికెట్ ఇచ్చాడంటే ‘భజరంగి భాయిజాన్’ ఎంతమంచి సినిమానో అర్థం చేసుకోవచ్చు.