Begin typing your search above and press return to search.
మహాభారతం: జక్కన్న రెడీ! అమీర్ వెనక్కి!?
By: Tupaki Desk | 14 March 2019 1:28 PM GMTసరిగ్గా బాహుబలి సిరీస్ రిలీజ్ సమయంలో జరిగిన ఆసక్తికర చర్చ ఇది. ఓవైపు ఎస్.ఎస్.రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అంటూ ప్రకటించారు. మహాభారతం తీసి తీరతానని అన్నారు. ఈలోగానే మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సైతం మహాభారతం తెరకెక్కిస్తున్నానని ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు. అదే సమయంలో మోహన్ లాల్ నుంచి ఆ ప్రకటన వచ్చింది. కానీ ఆ ముగ్గురిలో ఎవరూ ఇంతవరకూ మహాభారతం ప్రారంభించలేదు. మరోసారి నేడు ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ లో మహాభారతం గురించి రాజమౌళి ప్రస్థావించడంతో ఆసక్తికర చర్చ సాగింది.
నేడు మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ 54వ పుట్టినరోజు వేడుకలు ముంబై - బాంద్రాలో ఆయన స్వగృహంలో వైభవంగా జరిగిన సందర్భంగా మరోసారి అభిమానులకు మహాభారతం గుర్తుకొచ్చింది. ఈ సందర్భం గా ఆయన మాజీ భార్య కిరణ్ రావు సమక్షంలో కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇక ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన మీడిమా మీట్ లో అమీర్ ఖాన్ పై మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది. 2018లో అమీర్ ఖాన్ నటించిన తగ్స్ ఆఫ్ హిందూస్తాన్ డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో కొత్త ప్రాజెక్టును ప్రకటించేందుకు చాలానే సమయం తీసుకున్నారు? ఇంతకీ ఆయన ఏ సినిమాలో నటించబోతున్నారు? అన్న ప్రశ్నకు.. టామ్ హ్యాంక్ నటించిన ఫారెస్ట్ గంప్ అనే చిత్రాన్ని అధికారికంగా రీమేక్ చేయనున్నారట. ఇకపోతే రిలయన్స్ అంబానీలతో కలిసి 1000 కోట్ల బడ్జెట్ తో మహాభారతాన్ని సిరీస్ గా తెరకెక్కిస్తానని అమీర్ ఖాన్ అన్నారు. ఆ ప్రాజెక్టు గురించి ప్రస్థావనే లేదు. మరోవైపు ఎస్.ఎస్.రాజమౌళి సైతం మహాభారతం సిరీస్ తన కెరీర్ చిట్ట చివరి సిరీస్ అవుతుందని ప్రకటించారు. ఈ నేపద్యంలో అమీర్ ఆలోచన ఎలా ఉందో తెలియాల్సి ఉంది. అమీర్ ఇప్పటికి వెనక్కి తగ్గినా.. జక్కన్న మనసులో మాత్రం ఆ ఆలోచన ఉందని అందరికీ హింట్ దొరికింది. అమీర్ - రాజమౌళి ఇద్దరిలో ఎవరు ముందుగా ఆ ప్రయత్నాన్ని పట్టాలెక్కిస్తారో చూడాలి.
మరో ఆసక్తికర ప్రశ్నకు అమీర్ సమాధానమిచ్చారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ ఓటు గురించి క్యాంపెయినింగ్ నిర్వహిస్తూ సెలబ్రిటీలతో అందుకు ప్రచారం చేయించాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు అమీర్ ఖాన్ - నాగార్జున సహా పలువురు అగ్ర తారలకు ఆయన స్వయంగా సంక్షిప్త సందేశాన్ని పంపించారు. ఇదే ప్రశ్న అమీర్ నే అడిగితే.. తాను కూడా అందుకు సమర్ధిస్తున్నట్టు తెలిపారు. ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మీరు భారతీయ జనతా పార్టీని సమర్ధిస్తున్నారా? ఆ పార్టీకి ప్రచారం చేస్తున్నారా? అని మీడియా ప్రశ్నిస్తే నేను ఏ రాజకీయ పార్టీకి ప్రచారం చేయబోనని అన్నారు. అలాగే తదుపరి ప్రాజెక్టు గురించి అమీర్ ఓ ప్రశ్నకు వివరణ ఇచ్చారు.