Begin typing your search above and press return to search.
ప్చ్.. పొగరాయుడైన పర్ఫెక్షనిస్ట్
By: Tupaki Desk | 1 Dec 2016 2:09 AM GMTఎలాంటి వారికైనా ఓ చెడ్డ అలవాటు ఉంటుందన్నది సామెత. చాలాసార్లు ఇది నిజం అనే అనిపిస్తుంది. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అయిన అమీర్ ఖాన్ ను చూస్తే.. నూటికి నూటికి నూరు పాళ్లు నిజం అని అంగీకరించాల్సిందే. ఎంత పర్ఫెక్షనిజం కోసం పోరాడే వ్యక్తి అయినా.. అమీర్ కి కూడా ఓ బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అదే తెగ స్మోక్ చేసేయడం. కానీ ఇది గతం. రెండేళ్ల నుంచి సిగరెట్లకు పూర్తిగా దూరంగా ఉంటున్నాడు ఈ దంగల్ హీరో.
అన్నీ మానేసి నిజంగా పర్ఫెక్ట్ అయిపోయాడని అనుకుంటే.. ఇప్పుడు పొగ పీకడం మళ్లీ మొదలెట్టాడట అమీర్ ఖాన్. దంగల్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయం తనే చెప్పాడు కూడా. 'అవును.. అది మళ్లీ మొదలైంది. నేను ఈ సినిమా గురించి బాగా ఒత్తిడి ఎదుర్కున్నాను. కానీ సినిమా రిలీజ్ కాగానే మళ్లీ మానేస్తాను' అంటూ చెప్పడం కాస్త కామెడీగానే ఉంది. మొదలెట్టడం.. మళ్లీ ఓ నెల్లాళ్ల తర్వాత మానేస్తానని అనడం విడ్డూరమే.
'స్మోకింగ్ చేస్తున్నందుకు నేను సంతోషంగా లేను. కాల్చకుండా ఉందామనే అనుకున్నా. కానీ సినిమా రిలీజ్ కి ముందు టెన్షన్ పడుతూ ఉంటాను. అప్పుడు మొదలుపెట్టి రిలీజ్ అయ్యాక మానేస్తుంటా. నా అలవాటు సినిమాలలో యాక్టింగ్ పై ప్రభావం చూపదు కదా' అంటూ సమర్ధించుకుంటున్నాడు ప్రస్తుతం పొగరాయుడైన పర్ఫెక్షనిస్ట్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/