Begin typing your search above and press return to search.

బాహుబలి సూపరట.. కాని చూడలేదట..

By:  Tupaki Desk   |   4 Aug 2017 11:16 AM GMT
బాహుబలి సూపరట.. కాని చూడలేదట..
X
మొత్తం బాలీవుడ్ అంతా కూడా బాహుబలి మీద పడి ఏడుస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. దర్శకుడు కరణ్‌ జోహార్ ఈ సినిమాలోని బిజినెస్ పొటెన్షియల్ చూసి దీన్ని వేరే పార్టనర్లతో కలసి కొనుక్కుని రిలీజ్ చేసుకుని లాభం పొందాడు కాని.. బాలీవుడ్ లో స్టార్ హీరోలు మాత్రం ఈ సినిమా పేరు చెబితేనే కాస్త కోప్పడుతున్నారు. పైకి చెప్పకపోయినా కూడా.. వారు రెస్పాండ్ అవుతున్న తీరు అందుకు అద్దం పడుతోంది.

మొన్ననే తన కొత్త ప్రొడక్షన్ వెంచర్ ''సీక్రెట్ సూపర్ స్టార్'' ట్రైలర్ విడుదల చేశాడు అమీర్ ఖాన్. ఈ సందర్భంగా బాలీవుడ్ జర్నలిస్టులు మనోడ్ని ఒక ప్రశ్న అడిగారు. బాహుబలి 2 కేవలం హిందీ వెర్షనే 500 కోట్లు వసూలు చేసింది కదా.. మీకు ఆ కలక్షన్లను చూస్తుంటే భయం వేయట్లేదా అన్నారు. దానిపై స్పందించిన అమీర్.. ''బాహుబలి 2 తో మన హిందీ సినిమా స్థాయి ఏంటనేది మనకు తెలిసింది. అనేక వందల కోట్లు మనం ఎందుకు వసూలు చేయలేకపోతున్నాం? కాబట్టి మంచి సినిమాలు తీయాలి. అలాగే బాహుబలి 2 కూడా బోర్డర్లను చెరిపేసి ఇండియా అంతటా హిట్టయినందుకు ఆనందంగా ఉంది. కాని నేను ఇంకా సినిమాను చూడలేదు. నాకు వీలుపడినప్పుడు ఖచ్చితంగా చూస్తాను'' అంటూ సెలవిచ్చాడు. ఇదే సమయంలో బాహుబలి టీమ్ అందరికీ శుభాకాంక్షలు అని కూడా ఒక మాటనేశాడు.

ఇండియా అంతటా మెచ్చిన సినిమా.. ఇండియాలోని చాలామంది వీక్షకులు చూసిన సినిమా.. కాని మన అమీర్.. సల్మాన్.. షారూఖ్‌ మాత్రం ఇంకా బాహుబలిని చూడలేదు. చూడలేదా? లేకపోతే చూశాం అని చెప్పడం ఇష్టంలేదా? గతంలో ఈ ముగ్గురు స్టార్లూ ఇలాంటి పౌరాణికాలు ప్రయత్నించి చేతులు కాల్చుకున్నవారే. అందుకే ఏమన్నా అసూయగా ఉందేమో.