Begin typing your search above and press return to search.
టాప్ స్టోరి: పల్లె పల్లెకు సైనమా
By: Tupaki Desk | 26 Oct 2018 3:30 PM GMTపల్లె పల్లెకు సినిమా థియేటర్లను ఏర్పాటు చేయగలిగితే.. ఆ మేరకు వినోద పరిశ్రమను విస్తరించగలిగితే.. ఈ ఆలోచన ఇప్పటిది కాదు. ఎందరో మేధావులు ఎంతో కాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కమల్ హాసన్ లాంటి అడ్వాన్స్ థింకర్ ప్రతి ఇంట్లో డిజిటల్ స్క్రీన్ పై సినిమాని చూసే రోజు రావాలని ఆకాంక్షించారు. డీటీహెచ్ ని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉందని అన్నారు. అయితే అదేదీ ఇప్పట్లో కుదిరేపని కాదని అనుభవంలో తెలిసింది. ఇకపోతే ఎన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నా - థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవాళ్ల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఆ ఆదరణ ఉంది కాబట్టే ఇంకా థియేటర్లు రన్ అవుతున్నాయి. ప్రస్తుతం డిజిటల్ రాజ్యమేలుతున్న ఈరోజుల్లో ఇండియాలో సినిమా పురోవృద్ధికి ఇంకా ఇంకా ఏం చేయాలి? అన్న కీలకమైన చర్చను ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో బాలీవుడ్ దిగ్గజాలు చర్చించారు. ఇందుకు మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ - రాజ్ కుమార్ హిరాణీ - ఆనంద్.ఎల్.రాయ్ - సిద్ధార్థ్ రాయ్ కపూర్ - రితేష్ సిధ్వానీ - మహావీర్ వంటి ప్రముఖులు ఈ చర్చా గోష్టిలో పాల్గొన్నారు.
ఈ చర్చల్లో ప్రధానంగా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని సమస్యల్ని ప్రస్థావించారు. ఇందులో పల్లెల స్థాయిలో థియేటర్ల వ్యవస్థ గురించిన చర్చా సాగింది. పల్లెల స్థాయికి సినిమాని తీసుకెళ్లాలని వినతి ప్రధానికి అందింది. ఈ సందర్భంగా సమస్యలు విన్న ప్రధాని.. ప్రత్యేకించి పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ఓ అధికారిని ప్రభుత్వం తరపున అపాయింట్ చేశారని తెలుస్తోంది.
ఈ సందర్భంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ- `ప్రధాని ఎంతో పాజిటివ్ గా స్పందించారు. ఇది ఎంతో సంతోషదాయకం. అన్ని సమస్యల పరిష్కారానికి ఇది అక్కరకొస్తుంది`` అని అన్నారు. ప్రధానితో భేటీ అంటే మంచిదే. కేవలం ఇది ఉత్తరాది రాష్ట్రాల వరకూ పరిమితమైన సమస్య కాదు. అన్ని సినీఇండస్ట్రీస్ లోనూ ఇదే సన్నివేశం ఉంది. ఇక్కడా పల్లె పల్లెకూ థియేటర్లను తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. థియేటర్ల సమస్యతో పాటు ఇండస్ట్రీల్లో సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాల్సి ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ పల్లె పల్లెకు మినీ థియేటర్లు అంటూ ప్రభుత్వ హడావుడి కనిపిస్తోందే తప్ప ఇంతవరకూ ఏదీ లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్టాండ్లలో మినీ థియేటర్లకు ప్రభుత్వం జీవో జారీ చేస్తోందని తెలంగాణ ఎఫ్‌డీసీ ప్రకటించింది. ఆ తర్వాత దానికి సంబంధించిన మరో అప్ డేట్ లేనేలేదు. ఇక ఏపీలో కొత్త సినీపరిశ్రమ ఏర్పాటునకు సన్నాహాలు సాగుతున్నాయన్న భజన చేస్తున్నారు కానీ, దానికి సంబంధించిన ఏ ప్రూఫ్ కనిపించడం లేదు. ఈ జాప్యంలో వేగం పెంచేందుకు ప్రధాని మోదీ మన తెలుగు రాష్ట్రాలకు ఒకరిని అపాయింట్ చేస్తే బావుంటుంది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంపై కత్తి కట్టిన మోదీ అటువైపు స్పందిస్తారని ఎవరూ అనుకోవడం లేదు కాబట్టి, కనీసం తెలంగాణ వరకూ అయినా వినోద పరిశ్రమ విషయంలో ఆయన స్పందిస్తారేమో?