Begin typing your search above and press return to search.
రజనీ సార్ చెయ్యమన్నా.. నేను వద్దన్నా
By: Tupaki Desk | 20 Oct 2017 6:30 AM GMTబహుబలి తర్వాత ఇండియన్ ఆడియెన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం రజినీకాంత్ 2.0. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని కోలీవుడ్ దర్శకుడు శంకర్ తెరకెక్కించాడు. దాదాపు సినిమా ఎండింగ్ కి వచ్చేసింది. చివరగా కొన్ని పాటలతో అలాగే గ్రాఫిక్స్ పనులలో కూడా చిత్ర యూనిట్ బిజీగా వుంది. అయితే రీసెంట్ గా ఈ సినిమా గురించి ఎవరూ ఉహించనటువంటి ఒక న్యూస్ బయటకి వచ్చింది.
సాదారణంగా దర్శకుడు ఒక కథ రాసుకున్నప్పుడు ఏ హీరో తో చేస్తే బావుంటుంది అనే విషయంలో ఎక్కడో ఒక చోట పలాన ఆ హీరో అయితే బెస్ట్ అనుకుంటాడు. అంతే కాకుండా భారీ బడ్జెట్ సినిమా అయితే మంచి మార్కెట్ ఉన్న హీరోతో చేయాలని అనుకుంటాడు. శంకర్ కూడా మొదట తన చూపును బాలీవుడ్ వైపే మళ్లించాడట. శంకర్ కి బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఇండియాలో ఉన్న టాప్ దర్శకుల్లో శంకర్ ఒకరు. అయితే 2.0 కథను రాసుకున్నప్పుడు శంకర్ మొదట రజినీకాంత్ ని అనుకోలేదట. డైరెక్ట్ గా అమీర్ ఖాన్ ని చేయమని అడిగారట. ఈ విషయాన్ని అమీర్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
అమీర్ ఏమన్నాడంటే.. శంకర్ మొదట నన్ను రోబో సీక్వెల్ చేయమని కోరారు. కథ అద్భుతంగా ఉంది. కాని నేను కథ విన్నప్పుడు నా మైండ్ లో కేవలం రజినీకాంత్ గారే గుర్తొచ్చారు. దీంతో నేను చేయనని చెప్పాను. నాకు ఫస్ట్ పార్ట్ చాలా నచ్చింది. ముందుగా రజినీకాంత్ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయన స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే నాకు రోబో సీక్వెల్ లో కూడా ఆయన కనిపిస్తానే అది చాలా బావుంటుంది. నేను చేస్తే ఆ స్థాయిలో ఉండకపోవచ్చు. రజినీకాంత్ గారు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు. నువ్వు తప్పకుండా సినిమా చెయ్యాలని. కానీ మీరు మాత్రమే ఆ సినిమా చేయగ్గలరు సర్ అని రజినీకాంత్ గారిని ఒప్పించినట్లు చెప్పారు.
ఇక సినిమా తప్పకుండా ఇండియాలోనే బిగ్గెస్ట్ అవుతుందనే నమ్మకం తనకు ఉందని చెబుతూ.. శంకర్ చాలా గొప్ప దర్శకుడిని అమిర్ వివరించారు.