Begin typing your search above and press return to search.

కొత్త కథను క్రియేట్ చేసుకున్నాడా? లేదంటే ఫ్రీమేక్ చేస్తున్నాడా?

By:  Tupaki Desk   |   5 Jan 2023 2:30 AM GMT
కొత్త కథను క్రియేట్ చేసుకున్నాడా? లేదంటే ఫ్రీమేక్ చేస్తున్నాడా?
X
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రస్తుతం చాలా బాడ్ టైమ్ అయితే ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు సినిమాలు చేయడం కరెక్ట్ కాదు అని అతను కొంత గ్యాప్ కూడా తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అందుకే ప్రస్తుతం అతను పెద్దగా యాడ్ షూట్స్ కూడా చేయడం లేదు.

లాల్ సింగ్ చెడ్డా సినిమా డిజాస్టర్ కావడమే కాకుండా అంతకు ముందు అమీర్ ఖాన్ చేసిన కొన్ని పొరపాట్లు కూడా ఆ సినిమా ఫ్లాప్ కావడానికి కారణం కావడంతో అతనిపై దారుణంగా ట్రోల్లింగ్స్ అయితే వచ్చాయి. ఇక ఇప్పుడు ఏ పని చేయకపోతేనే బెటర్ అని కొంత గ్యాప్ తీసుకొని మంచి కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలి అని డిసైడ్ అయ్యాడు.

అయితే ప్రస్తుతం అమీర్ ఖాన్ మళ్లీ ఒక రీమేక్ సినిమా చేయడానికి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. చాలా కాలంగా అమీర్ స్పానిష్ కామెడీ చిత్రం "చాంపియోన్స్" ను రీమేక్ చేస్తాడని టాక్ వస్తోంది. ఆ కథలో కథానాయకుడు తాగుబోతు మాజీ క్రీడా కోచ్. అతను దేశంలోని వికలాంగుల జట్టుకు శిక్షణ ఇచ్చి వారిని పతకం గెలుచుకునేలా చేస్తాడు.

అయితే ఆ కథ లైన్ గురించి వింటూ ఉంటే ఇటీవల బుచ్చిబాబు రెడీ చేసుకున్న కథ గుర్తుకు వస్తోంది. మొదట ఎన్టీఆర్ తో చేయాలని అనుకున్న బుచ్చిబాబు ఆ తర్వాత రామ్ చరణ్ తో ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు. అయితే వీరి కాంబినేషన్లో వచ్చే కథ కూడా దాదాపు ఆ కథకు దగ్గరగా ఉన్నట్లుగా అనిపిస్తుంది.

దాదాపు ఆ స్టోరీ తరహాలోనే తెలుగు నేటి వీటికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసి సినిమాను తెరపైకి తీసుకురావాలి అని బుచ్చిబాబు ప్రణాళికలు రచించినట్లుగా టాక్ వస్తోంది. అయితే గతంలో ఇదే తరహాలో తెలుగులో త్రివిక్రమ్ లాంటివాళ్ళు ఫ్రీమేక్ చేసి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి బుచ్చిబాబు నిజంగానే ఆ కథ నుంచి స్ఫూర్తి పొంది తనదైన శైలిలో కొత్త కథను క్రియేట్ చేసుకున్నాడా? లేదంటే ఫ్రీమేక్ చేస్తున్నాడా? అనేది తెలియాలి అంటే కొంత కాలం ఆగాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.