Begin typing your search above and press return to search.

ఆమిర్ ని రజినీ డిజప్పాయింట్ చేయలే

By:  Tupaki Desk   |   17 Dec 2016 9:30 AM GMT
ఆమిర్ ని రజినీ డిజప్పాయింట్ చేయలే
X
ఆమిర్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ దంగల్.. సౌత్ లో కూడా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. తెలుగు.. తమిళ్ వెర్షన్స్ ను కూడా హిందీతో కలిపి ఏకకాలంలో విడుదల చేయనున్నారు. అయితే.. ఇక్కడి లోకల్ వెర్షన్స్ కు ఆమిర్ ఖాన్ రోల్ కు డబ్బింగ్ ఎవరు చెప్పనున్నారన్నదే అసలు పాయింట్.

తమిళ్ దంగల్ కోసం రజినీకాంత్ ని డబ్బింగ్ చెప్పమని అడిగితే.. సూపర్ స్టార్ తోసిపుచ్చారనే టాక్ ఉంది. దీనిపై క్లారిటీ ఇచ్చాడు ఆమిర్ ఖాన్. 'రజినీకాంత్ కోసం ప్రత్యేకంగా దంగల్ స్క్రీనింగ్ చేశాం. అప్పుడే ఆయన్ను నా పాత్రకు డబ్బింగ్ చెప్పమని అడిగాను. కానీ ఇద్దరూ బాగా ప్రఖ్యాతి చెందిన నటులు కావడంతో.. ఈ ఐడియా వర్కవుట్ కాదని ఆలోచించాం. రజినీ సార్ అయితే.. నా ఫేస్ కి తన వాయిస్ సూట్ కాదని వివరణ ఇచ్చారు' అని చెప్పాడు ఆమిర్ ఖాన్.

దీంతో తెలుగు.. తమిళ వెర్షన్స్ కు సంబంధించి ఆమిర్ కు డబ్బింగ్ చెప్పే పర్ఫెక్ట్ ఆర్టిస్టుల కోసం ప్రస్తుతం వెతుకుతున్నారట. ఇంకా రిలీజ్ కి ఆరు రోజుల సమయం మాత్రమే ఉండడంతో.. త్వరగా ఈ పనులు ఫినిష్ చేయమని ఆదేశించారట. ఇదిలా ఉంటే గతంలో రజినీ-ఆమిర్ లు1995లో విడుదలైన ఆటంక్ హీ ఆటంక్ అనే మూవీలో కలిసి నటించారు. సూపర్ స్టార్ హిందీ సినిమాల్లో చేస్తే చూడాలని ఉందంటూ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ చేసిన కామెంట్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/