Begin typing your search above and press return to search.

చైనాలో కూడా సూపర్ స్టారే

By:  Tupaki Desk   |   20 Jan 2018 7:36 AM GMT
చైనాలో కూడా సూపర్ స్టారే
X
వజ్రాన్ని ఏ దేశం తీసుకువెళ్ళినా దాని విలువ తరుగుతుందా. లేదుగా. చూస్తుంటే అమీర్ ఖాన్ సినిమాలు అలాగే అనిపిస్తున్నాయి. లాస్ట్ ఇయర్ దంగల్ తో చైనాలో సైతం రికార్డుల దుమ్ము దులిపిన అమీర్ ఖాన్ తన విజయ పరంపరను సీక్రెట్ సూపర్ స్టార్ తో కొనసాగిస్తున్నాడు. శుక్రవారం చైనాలో విడుదలైన సీక్రెట్ సూపర్ స్టార్ మొదటి రోజే ఏకంగా 6.79 మిలియన్ డాలర్లు(మన కరెన్సీలో 43.35 కోట్లు)వసూలు చేసి చైనా సినిమా వర్గాలను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇంతకు ముందు దంగల్ నెలకొల్పిన ఫస్ట్ డే రికార్డును సీక్రెట్ సూపర్ స్టార్ ఈజీగా దాటేసింది. అక్కడ మీడియాతో వహ్వా అనిపించుకున్న ఈ మూవీకి చైనా ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. దంగల్ కంటే ఇదే ఎక్కువ విజయాన్ని సొంతం చేసుకునే దిశగా వెళ్ళడం చూసి ఇక్కడి ట్రేడ్ వర్గాలు కూడా ఔరా అంటున్నాయి.

దీనికి కారణం అమీర్ ఖాన్ ఇమేజ్ ఒకటే కాదు. అందరిని మెప్పించి ఆలోచింపజేసే యూనివర్సల్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తున్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా గజమాలలు పడుతున్నాయి. ఎమోషన్స్ ని బాగా ఇష్టపడే చైనీయులు దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాల్లో మధ్య తరగతి జీవితాలనే ప్రతిబింబించేలా తీయటంతో రిపీట్ ఆడియన్స్ తో థియేటర్లు హోరేత్తిపోతున్నాయి .టైటిల్ రోల్ లో జైరా వాసిం నటనకు చైనా టీనేజర్స్ ఫిదా అవుతున్నారని టాక్. దంగల్ ను కూడా సీక్రెట్ సూపర్ స్టార్ క్రాస్ చేసే అంచనాలు ఉన్నాయి. త్వరలో విడుదల చేయబోయే బాహుబలి 2 కూడా ఇలాంటి రికార్డ్స్ సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. గతంలో బాహుబలి ఫస్ట్ పార్ట్ జాకీ చాన్ సినిమాకు పోటీగా విడుదల చేయటంతో ఊహించిన రెస్పాన్స్ దక్కించుకొని బాహుబలి ఈ సారి మాత్రం సీక్వెల్ తో దంగల్ రికార్డుకు ఎసరు పెట్టినా ఆశ్చర్యం లేదు.

మొత్తానికి భారతీయ సినిమా పరిధి దేశాల మధ్య వారధులు తొలగించి చైనా లాంటి దేశాల్లో సైతం విజయవంతం కావడం చూస్తుంటే భవిష్యత్తులో ఇండియన్ మార్కెట్ తో సమానంగా ఓవర్సీస్ అభివృద్ధి చెందినా ఆశ్చర్యం లేదు . సీక్రెట్ సూపర్ స్టార్ జోరు చూస్తుంటే అది ఎంతో దూరంలో లేదు అనిపిస్తోంది.