Begin typing your search above and press return to search.
మహేష్ కోసం అమీర్ ఖాన్?
By: Tupaki Desk | 20 Feb 2023 5:28 PM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత రాజమౌళితో పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నాడు. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథాంశం ఉంటుంది అని ఇప్పటికే రాజమౌళి ప్రకటించాడు. ఇక ఈ సినిమాలో వరల్డ్ అడ్వంచర్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు పాత్ర ఉండబోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం కూడా ఆర్ఆర్ఆర్ తరహాలో హాలీవుడ్ యాక్టర్స్ ని జక్కన్న ఎంపిక చేయబోతున్నాడు అనే టాక్ గతంలో వినిపించింది.
హాలీవుడ్ క్యాస్టింగ్ ఏజెన్సీతో ఈ మూవీ నటుల కోసం ఒప్పందం కూడా చేసుకున్నారు. అయితే ప్రస్తుతం సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబందించిన క్రేజీ రూమర్ తెరపైకి వచ్చింది. ఈ మూవీలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు అనే టాక్ ఇప్పుడు వైరల్ గా మారింది. గతంలో రాజమౌళి దర్శకత్వంలో ఎలాంటి పాత్ర వచ్చిన చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
తెలుగు స్టార్స్ తో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నేపధ్యంలోనే జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఓ ఇంటరెస్టింగ్ రోల్ కోసం అమీర్ ఖాన్ ని సంప్రదించినట్లు టాక్ వినిపిస్తుంది. ఇక అమీర్ ఖాన్ కూడా ఒప్పుకున్నాడనే ప్రచారం నడుస్తుంది.
మరి అలాంటి స్టార్ సూపర్ స్టార్ మూవీలో నటించడానికి ఒప్పుకున్నాడు అంటే కాస్తా నమ్మదగ్గ విధంగా అయితే లేదు. అయితే జక్కన్న సినిమాలలో ఏదైనా సాధ్యం అవుతుందని కొంతమంది చెప్పే మాట. మరి దీనిలో వాస్తవం ఏంటి అనేది తెలియాలంటే ఎవరో ఒకరు కచ్చితంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.