Begin typing your search above and press return to search.
అందరూ కలిసి దంగల్ కే పట్టం కట్టారు
By: Tupaki Desk | 28 Dec 2016 5:30 PM GMTగత ఐదారు రోజుల నుంచి ఇండియన్ ఫిలిం సర్కిల్స్ లో ఎక్కడ చూసినా ‘దంగల్’ గురించే చర్చ. ఇంత గొప్ప సినిమా ఎన్నడూ చూడలేదని కొందరు.. గత దశాబ్ద కాలంలో ఇదే అత్యంత గొప్ప సినిమా ఇంకొందరు.. ఇలా ఎటు చూసినా ఆ సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా ఇండియాలోని ప్రముఖ క్రిటిక్స్ అందరూ కూడా ఈ ఏడాదికి ‘దంగల్’ సినిమానే ది బెస్ట్ అని తేల్చేశారు. ఫిల్మ్ కంపానియన్ ఈ ఏడాదికి ప్రకటించిన క్రిటిక్స్ ఛాయిస్ బెస్ట్ ఫిలింగా ‘దంగల్’ ఎంపికైంది. రాజీవ్ మసంద్.. అనుపమ్ చోప్రా సహా 23 మంది ప్రముఖ విమర్శకులు దంగల్‌ను 2016కు ఉత్తమ చిత్రంగా ఎంపిక చేశారు.
హైజాక్ అయిన ఫ్లైట్లో ప్రయాణికుల ప్రాణాలు కాపాడటం కోసం తన ప్రాణాలు త్యాగం చేసిన ఎయిర్ హోస్టెస్ నీర్జా బానోత్ కథతో సోనమ్ కపూర్ కథానాయికగా ‘నీర్జా’ సినిమా తీసి మెప్పించిన రామ్ మద్వాని ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యాడు. ‘అలీగఢ్’లో స్వలింగ సంపర్కుడైన ప్రొఫెసర్ పాత్రను అద్భుతంగా పోషించిన మనోజ్ బాజ్ పేయిని ఉత్తమ నటుడిగా.. ‘ఉడ్తా పంజాబ్’.. ‘డియర్ జిందగీ’ సినిమాల్లో ఆకట్టుకున్న ఆలియా భట్ ను ఉత్తమ నటిగా.. ‘కపూర్ అండ్ సన్స్’ సినిమాకు స్క్రిప్టు అందించిన షకున్ బత్రా.. ఆయేషా ధిల్లాన్ లను ఉత్తమ రచయితలుగా ఎంపిక చేసింది ఈ క్రిటిక్స్ టీమ్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/