Begin typing your search above and press return to search.
`థగ్స్` కోసం 2 భారీ ఓడలు..1000 మంది!
By: Tupaki Desk | 25 July 2018 4:34 PM GMT`దంగల్` తో ప్రపంచ వ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు వసూలు చేసిన మిస్టర్ పర్ ఫెక్ట్ ఆమీర్ ఖాన్....`సీక్రెట్ సూపర్ స్టార్`లో గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన తర్వాతి చిత్రం`థగ్స్ ఆఫ్ హిందుస్థాన్` షూటింగ్ లో ఆమీర్ బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అమితాబ్ బచ్చన్ - కత్రినా కైఫ్ వంటి స్టార్ కాస్ట్ తో పాటు `దంగల్` ఫేమ్ ఫాతిమా సనా షేక్ కూడా ఈ చిత్రంలో నటిస్తోంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆమీర్‌తో ‘ధూమ్ 3’ తెరకెక్కించిన విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం కోసం సుమారు 2 లక్షల కిలోల బరువున్న రెండు భారీ ఓడల సెట్లను రూపొందించారట. హాలీవుడ్ లో పనిచేసిన డిజైనర్లు దీనిని రూపొందించారని తెలుస్తోంది.
19వ శతాబ్దం తొలినాళ్లలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి సవాల్ విసిరిన దోపిడి దొంగల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 1839లో వచ్చిన ‘కన్ఫెషన్స్ ఆఫ్ ఎ థగ్’ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అమితాబ్ - ఆమీర్ లు దారికాచి దోపిడీలు చేసే దొంగల పాత్రల్లో నటిస్తున్నారు. సముద్రంలో పడవలపై జరిగే యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలెట్ అట. అందుకే హాలీవుడ్ నిపుణులు ఓడల సెట్లను నిర్మించారట. వాటికోసం దాదాపు 1000 మంది సంవత్సరం పాటు శ్రమించారట. బాలీవుడ్‌లో గతంలో ఎపుడూ రాని విధంగా ఓడలో యాక్షన్ సన్నివేశాలుంటాయట. ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కు పేరుగాంచిన యష్ రాజ్ ఫిలింస్....తొలిసారి ఓ యాక్షన్ ప్రధాన చిత్రాన్ని రూపొందించడం విశేషం.