Begin typing your search above and press return to search.

ఆమీర్ రావడమంటూ జరిగితే అద్భుతమే..!

By:  Tupaki Desk   |   6 Jan 2023 12:30 AM GMT
ఆమీర్ రావడమంటూ జరిగితే అద్భుతమే..!
X
బాలీవుడ్ హీరోల కన్ను ఇప్పుడు సౌత్ సినిమాల మీద పడింది. పాన్ ఇండియా మార్కెట్ అందుకోవాలంటే మాత్రం కేవలం హిందీలోనే చేస్తే సరిపోదని వారికి అర్థమైంది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేరాఫ్ బాలీవుడ్ అన్న టాక్ ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సౌత్ సినిమాలు బాలీవుడ్ లో విజయ బావుటా ఎగురవేస్తున్నాయి. అందుకే అక్కడ నటీనటులు కూడా సౌత్ సినిమాల వైపు చూస్తున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ సౌత్ సినిమాలు చేస్తుండగా లేటెస్ట్ గా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ కూడా ఓ తెలుగు సినిమాలో నటించబోతున్నారని టాక్. ఇండియన్ స్క్రీన్ మీద ఆమీర్ ఖాన్ చాలా ప్రయోగాలు చేశారు.

ఆయన సినిమాలు సౌత్ ఆడియన్స్ ని సూపర్ గా ఎంటర్టైన్ చేశాయి. హీరో ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా విలక్షణ పాత్రలు.. విభిన్న కథలతో ఆమీర్ ఖాన్ మెప్పిస్తూ వచ్చారు. అయితే ఈమధ్య ఆయన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమవుతున్నాయి.

రీసెంట్ గా వచ్చిన లాల్ సింగ్ చడ్డా సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఎన్.టి.ఆర్ 30వ సినిమాలో ఎన్.టి.ఆర్ తో కలిసి ఆమీర్ ఖాన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని టాక్. సినిమాలో ఒక విలక్షణమైన పాత్రలో ఆమీర్ అయితేనే పర్ఫెక్ట్ అని మేకర్ భావిస్తున్నారట.

ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్టు టాక్. ఆమీర్ కూడా తను కూడా సౌత్ సినిమాల్లో నటించాలని ఉందన్న ఆసక్తిని అప్పట్లో కనబరిచారు. ఆమీర్ ఖాన్, ఎన్.టి.ఆర్ కలిసి నటిస్తే మాత్రం ఆ సినిమా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు.

ఆమీర్ ఖాన్ ఈ ఆఫర్ ఓకే అంటారా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది. ఆమీర్ ఖాన్ చేస్తే ఎన్.టి.ఆర్ 30వ సినిమాకు పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ క్రేజ్ ఏర్పడుతుంది. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్, యువ సుధ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఎన్.టి.ఆర్ 30వ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.