Begin typing your search above and press return to search.

పాపం అమీర్ ఖాన్ ను అనవసరంగా..

By:  Tupaki Desk   |   18 Aug 2016 7:30 PM GMT
పాపం అమీర్ ఖాన్ ను అనవసరంగా..
X
కొంతమంది హీరోలు కానివ్వండి ఇతర సెలబ్రిటీలు కానివ్వండి .. చేసేది ప్రజా సేవ అయినా కూడా దానికి విపరీతమైన పాపులార్టీ తెచ్చేస్తారు. పిఆర్ ఏజన్సీల ద్వారా మీడియాకు వార్తలు రిలీజ్ చేసి.. ఆ పని గురించి మాంచి పబ్లిసిటీ చేయిస్తారు. కాని హీరో అమీర్‌ ఖాన్‌ మాత్రం.. అప్పట్లో ''అసహనం'' కామెంట్లతో అందరి చేతిలో తిట్లు తిన్నా కూడా.. తను చేసే పనులతో గాట్టి జవాబే చెబుతున్నాడు. వాటిని పబ్లిసైజ్ చేసుకోవట్లేదు.

మనకు తెలిసిన విషయం ఏంటంటే.. మహారాష్ట్రలో దేశంలో ఎక్కడాలేనంత నీళ్ళ కొరత ఉంది. దాదాపు కరువుకు దగ్గరగా పరిస్థితులు ఉన్నాయి. అందుకే అమీర్ ఖాన్ తన పానీ ఫౌండేషన్ ద్వారా ఒక కాంపిటీషన్ పెట్టాడు. ప్రతీ గ్రామం నుండి ఐదుగురుకి నీళ్ళను ఎలా స్టోర్ చేయాలో నేర్పించారు. వాన నీటినే కాకుండా.. రోజువారి వాడే నీటిని కూడా తిరిగి ఉపయోగించుకునే పద్దతులను కొన్ని వీరికి నేర్పారు. వీళ్ళలో ఏ గ్రామం వారు ఆ పద్దతులు అన్నీ ఫాలో అయ్యి ఎక్కువ నీరు స్టోర్ చేసుకుంటారో వారికి 50 లక్షల బహుమతి ప్రకటించాడు. ఈ దెబ్బకి ఒక్కో గ్రామం పోటీపడి మరీ నీళ్ళను నిల్వచేయసాగాయి. ఇదే కాంపిటీషన్ రాష్ట్రం అంతా అమలు చేస్తే.. ఖచ్చితంగా వచ్చే ఐదేళ్ళలో మహారాష్ట్ర మొత్తం నీటికరువు లేని ప్రాంతంగా మారుతుందని ఇతగాడి ప్లాన్. అందుకు దేవేంద్ర ఫద్నీస్ సర్కార్ కూడా అమీర్ కు సపోర్టు చేస్తోంది.

మొత్తానికి కేవలం పబ్లిసిటీ కోసం ప్రజాసేవ చేసే వారందరూ ఇప్పుడు అమీర్ ఖాన్ చేస్తున్న గొప్ప పనులు చూసి కళ్ళు తెరవాల్సిందే. ఈ ఫౌండేషన్ తరుపున ట్రైనింగ్ ఇవ్వడానికి ఏకంగా 100 మంది ఎంప్లాయిస్ ను పెట్టుకుని మరీ ఈ హీరో రంగంలోకి దిగాడంటే చూడండి.. ఎంతటి ధృడ సంకల్పంతో పనిచేస్తున్నాడో. ఇంత గొప్ప పనిచేస్తున్న అమీర్ ను అనవసరంగా తిట్టిపారేశాం అనే ఫీలింగ్ ఇప్పుడు చాలామందికి కలుగుతోంది అంటే అతిశయోక్తి కాదులే.