Begin typing your search above and press return to search.
7 భాగాలుగా 1000 కోట్ల 'మహాభారతం'
By: Tupaki Desk | 11 Nov 2018 7:06 AM GMTమిస్టర్ పెర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న `థగ్స్ ఆఫ్ హిందూస్తాన్` తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా `బాహుబలి`సిరీస్‌ని కొట్టాలన్న ప్రయత్నం కాస్తా విఫలమైంది. ఈ సినిమా రిలీజ్ వేళ మిశ్రమ స్పందనలతో అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్న చందంగా సీన్ మొత్తం రివర్సయ్యింది. మొదటి రోజు రికార్డులు మినహా ఈ సినిమా గురించి చెప్పుకోదగినదేదీ లేదన్న మాటా వినిపిస్తోంది. భారీ కాస్టింగ్ ఉన్నా.. బాక్సాఫీస్ వద్ద తొలి మూడు రోజుల వసూళ్లు బావున్నా.. ఇప్పటికే 150కోట్ల వసూళ్లు సాధించినా.. ఈ సినిమా ఆశించిన స్థాయిని చేరలేదని కథనాలొస్తున్నాయి. ముఖ్యంగా అమీర్ ని ఈ రిజల్ట్ తీవ్రంగానే నిరాశపరిచింది. అమీర్ నటించిన పీకే - దంగల్ లాంటి సంచలనాల తర్వాత ఓ సాధాసీదా సినిమాలో నటించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. సినిమాలో అతడి పాత్ర ఫిరంగి మల్లయ్య పైనా సెటైర్లు పడిపోయాయి. 2000 కోట్ల వసూళ్లు తెచ్చే నటుడేనా ఈ సినిమా చేసినది.. అంటూ అభిమానుల నుంచే నిరసన వ్యక్తమైంది.
అటు బాలీవుడ్ వెబ్ సైట్లు సైతం `థగ్స్ ఆఫ్ హిందూస్తాన్`ని రివ్యూల్లో ఎండగట్టాయి. దీంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన అమీర్ ఖాన్ అనూహ్యంగా `మహాభారతం` సిరీస్ ని తెరపైకి తేవడం ఆసక్తి రేకెత్తిస్తోంది. పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలన్న పంతమో.. లేక ఇంకేదైనా సాధించాలన్న తపనో.. మొత్తానికి వదిలేశాడు అనుకున్నదానిని తెరపైకి తేవడం సర్వత్రా ఉత్కంఠ పెంచుతోంది. మహాభారతం సిరీస్ ని ఏడు భాగాలుగా తెరకెక్కించేందుకు పదేళ్లు కేటాయిస్తానని అమీర్ ఇదివరకూ ప్రకటించాడు. దీనికి 1000కోట్ల మేర బడ్జెట్ ఖర్చవుతుందని - రిలయన్స్ అంబానీలతోనూ టై అప్ పెట్టుకున్నాడు. కానీ మధ్యలోనే డోలాయమానం ..అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందా? క్యాన్సిల్ అవుతుందా? అంటూ సందేహాల్ని బాలీవుడ్ మీడియా వ్యక్తం చేసింది.
అయితే తాజా సన్నివేశం చూస్తుంటే.. అమీర్‌ని ముందుకు వెళ్లేలా చేసిందని అర్థమవుతోంది. మహాభారతం సిరీస్ కోసం కథాచర్చల్లో భాగంగా అమీర్ అమెరికాకు ట్రిప్ వేస్తున్నాడు. ఏడు వారాల పాటు అక్కడే తిష్ట వేసి తన రైటర్స్ టీమ్ తో దీనిపై భారీ కసరత్తు చేయనున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో అమీర్ లార్డ్ కృష్ణుడిగా నటిస్తాడని - ఇతర ఖాన్ లు - అమితాబ్ సహా ఇరుగుపొరుగు పరిశ్రమల నుంచి స్టార్లను బరిలో దించే ప్రయత్నాలు చేస్తున్నాడని ఇదివరకూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఏడు భాగాలకు ఏడుగురు దర్శకుల్ని అమీర్ ఎంచుకోనున్నాడు. మొత్తం ప్రాజెక్టుని తన కనుసన్నల్లో ఎగ్జిక్యూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఇది వెబ్ సిరీస్ మాత్రమేనా? లేక థియేటర్ రిలీజ్ తో పాటు - వెబ్ సిరీస్‌గా రూపకల్పన చేశారా? అన్నదానిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాకి భారీగా కాస్టింగ్ అవసరం కాబట్టి అమీర్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తారోనన్న ఆసక్తి నెలకొంది.