Begin typing your search above and press return to search.
ఒక మహాభారతం.. అనంతమైన రూమర్లు
By: Tupaki Desk | 19 Dec 2017 9:53 AM GMTఈ మధ్యనే టాలీవుడ్ లో ఒక ప్రచారం ఊపందుకుంది. రాజమౌళి తీయాలనుకుంటున్న డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం'.. ఇప్పుడు అమీర్ ఖాన్ తీసేస్తున్నాడు అయ్యో అంటున్నారు జనాలు. కాని నిజానికి ఇలాంటి కంపారిజన్స్ కాని.. అటు మహా భారతం సినిమా కాని.. రెండూ పెద్దగా ఆసక్తిని మాత్రం రేపట్లేదు. దానికో రీజన్ఉంది.
రాజమౌళి ఎలాగైతే మహా భారతం తన డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్పాడో.. అమీర్ ఖాన్ కూడా అదే చెప్పాడు. అంతేకాకుండా.. ఈ మధ్యన అమీర్ ఏమన్నాడంటే.. మహాభారతం సినిమా చేయాలంటే నాకు కనీసం 10 ఏళ్ల టైమ్ కావాలి. అలాగే పర్సనాలిటీ పరంగా నాకు కర్ణుడు లేదా అర్జునుడు అంటే ఇష్టం.. కాని ఇప్పుడు నేనున్న పరిస్థితికి కృష్ణుడు పాత్రను వేయాలి. వారియర్ గా ఫైటింగులు గట్రా చేయకుండా సరిపోతుంది.. అంటూ చెప్పాడు. దానిని అందుకున్న బాలీవుడ్ మీడియా.. అమీర్ ఖాన్ భారతం తీస్తున్నాడు అంటే.. తెలుగు మీడియా ఏకంగా రాజమౌళి ఆశలు అడియాసలు అయిపోయాయ్ అంటూ కంటిన్యూ స్టోరీ వేస్తున్నారు.
కాని నిజానికి మహా భారతం అనేది సింపుల్ గా ఒక సినిమాలో తీసిపాడేసి చిన్నా చితకా స్టోరీ కాదు. కాబట్టి ఆ సినిమాను ఎవరు ఎన్నిసార్లు ఎలా తీసినా కూడా.. మనం చూడొచ్చు. గ్రేటెస్ట్ వర్క్ఆఫ్ స్ర్కీన్ ప్లే అంటూ ఎంతోమంది హాలీవుడ్ రైటర్లు కొనియాడిన భారతంను.. ఎన్ని సినిమాలుగా తీసినా కూడా ఆడియన్స్ చూస్తారు. అయితే అందులో దేవుళ్ళ కాన్సెప్టును మాత్రం కాస్త జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలంతే.