Begin typing your search above and press return to search.
20 కేజీలు తగ్గబోతున్న సూపర్ స్టార్
By: Tupaki Desk | 30 March 2019 10:54 AM GMTబాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ సుదీర్ఘ విరామం తర్వాత 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' చిత్రంతో పరాజయం చవి చూసిన విషయం తెల్సిందే. ఆ చిత్రం దారుణమైన పరాజయం పాలవ్వడంతో అమీర్ ఖాన్ తదుపరి చిత్రం విషయంలో చాలా ఆలోచనలు చేశాడు. ఎన్నో కథలు విని - ఎంతో మంది దర్శకులతో చర్చలు జరిపిన తర్వాత హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'ఫారెస్ట్ గంప్' అనే చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సిద్దం అయ్యాడు. 1994లో వచ్చిన ఈ హాలీవుడ్ సినిమాలో హీరో పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. ఆ పాత్రకు దగ్గరగా వచ్చేందుకు అమీర్ ఖాన్ చాలా కష్టపడుతున్నాడు.
ఏ సినిమా చేసినా అందులోని పాత్రకు పరకాయ ప్రవేశం చేసే విధంగా అమీర్ ఖాన్ మేకోవర్ అవుతాడు. దంగల్ చిత్రం కోసం అమీర్ ఏ స్థాయిలో బరువు పెరిగాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు 'ఫారెస్ట్ గంప్' రీమేక్ చిత్రం 'లాల్ సింగ్ చద్దా' మూవీ కోసం అమీర్ ఖాన్ ఏకంగా 20 కేజీల బరువు తగ్గబోతున్నాడట. పూర్తిగా వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటూ బరువు తగ్గే ప్రయత్నాలు ప్రారంభించాడట. ఇప్పటికే 3.5 కేజీల బరువు తగ్గాడని - మరి కొన్ని రోజుల్లోనే అమీర్ అనుకున్న ఆ మొత్తం బరువును కూడా తగ్గబోతున్నట్లుగా తెలుస్తోంది. 20 కేజీల బరువు తగ్గిన తర్వాతే షూట్ కు వెళ్లాలని అమీర్ భావిస్తున్నాడు. అమీర్ ఖాన్ డెడికేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన అనుకున్నట్లుగా పూర్తి బరువు తగ్గే వరకు షూట్ కు వెళ్లడు. ఇటీవలే లాల్ సింగ్ చద్దా కోసం మేకప్ టెస్ట్ చేశారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమీర్ బరువు తగ్గి మరోసారి మేకప్ వేసుకుంటే ప్రేక్షకులు ఫిదా అవ్వడం ఖాయం.