Begin typing your search above and press return to search.

వీడియో : మిస్టర్‌ పర్ఫెక్ట్‌ సింప్లిసిటీ

By:  Tupaki Desk   |   23 April 2019 1:57 PM IST
వీడియో : మిస్టర్‌ పర్ఫెక్ట్‌ సింప్లిసిటీ
X
బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌ ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్తతో మీడియాలో ఉంటూనే ఉంటాడు. తాజాగా అమీర్‌ ఖాన్‌ విమానంలో బిజినెస్‌ క్లాస్‌ లో కాకుండా ఎకానమీ క్లాస్‌ లో ప్రయాణించాడు. ఎప్పుడు బిజినెస్‌ క్లాస్‌ లో ప్రయాణించే అమీర్‌ ఖాన్‌ ఎకానమీ క్లాస్‌ లో ప్రయాణించడంతో కాస్త హడావుడి కనిపించింది. ఎకానమీ క్లాస్‌ లోకి అమీర్‌ ఖాన్‌ ఎంటర్‌ అవ్వగానే అంతా కూడా అవాక్కయ్యారు. అమీర్‌ ఖాన్‌ తో ప్రయాణించబోతున్నందుకు అంతా కూడా చాలా సంతోష పడ్డారు. అమీర్‌ తో సెల్ఫీ లు తీసుకోవడం, ఆయన్ను వీడియోలు తీయడం చేశారు.

ఇంతకు అమీర్‌ ఎందుకు ఎకానమీ క్లాస్‌ లో ప్రయాణం చేయాల్సి వచ్చిందంటే.. మొన్నటి నుండి జెట్‌ ఎయిర్‌ వేస్‌ విమాన సర్వీసులను రద్దు చేయడం జరిగింది. దాంతో ఇతర ఎయిర్‌ సర్వీస్‌ లపై ఆ ప్రభావం పడింది. ఇతర విమాన సర్వీస్‌ ల రద్దీ కారణంగా అమీర్‌ బిజినెస్‌ క్లాస్‌ దక్కలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో, అర్జంట్‌ ప్రయాణం అవ్వడం వల్ల ఇబ్బంది అయినా పర్వాలేదు అని చివరి నిమిషంలో ఎకానమీ క్లాస్‌ లో ప్రయాణించాడట. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అమీర్‌ ఖాన్‌ ఎకానమీ క్లాస్‌ ప్రయాణంకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

ఇక అమీర్‌ సినిమాల విషయానికి వస్తే గత ఏడాది 'థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలా ఏళ్ల తర్వాత అమీర్‌ కు ఆ సినిమా డిజాస్టర్‌ ఫలితంను చూపించింది. ఆ సినిమా ఇచ్చిన షాక్‌ నుండి తేరుకున్న అమీర్‌ తదుపరి చిత్రంగా హాలీవుడ్‌ మూవీ ఫారెస్ట్‌ గంప్‌ ను లాల్‌ సింగ్‌ చద్దా పేరుతో రీమేక్‌ చేస్తున్నాడు. ఆ చిత్రం కోసం అమీర్‌ చాలా బరువు తగ్గుతున్నాడు. ఆ సినిమా కోసం ఎంత బరువు అయితే తగ్గాలనుకుంటున్నాడో అంత తగ్గిన తర్వాత షూటింగ్‌ కు వెళ్లనున్నాడట.