Begin typing your search above and press return to search.
అమీర్ ఖాన్ కు అక్కినేని ఫ్యామిలీ విందు.. పార్టీలో కనిపించని సమంత..!
By: Tupaki Desk | 25 Sep 2021 7:30 AM GMTయువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన 'లవ్ స్టోరీ' సినిమా నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్విట్టర్ రివ్యూస్ - టాక్ తో సంబంధం లేకుండా తొలి రోజు మంచి వసూళ్ళు రాబట్టింది. కరోనా సెకండ్ వేవ్ పాండమిక్ తర్వాత యూఎస్ఏ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. చై గ్రాండ్ ఫాదర్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన క్లాసిక్ 'ప్రేమ్ నగర్' విడుదల రోజునే 'లవ్ స్టొరీ' రావడం అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమాకు ఇండస్ట్రీ సపోర్ట్ కూడా బాగా లభించింది. అందరూ తమ సినిమాగా ప్రమోట్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి - బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హాజరై శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.
'లాల్ సింగ్ చద్దా' సినిమా షూటింగ్ షెడ్యూల్ లో నాగచైతన్య ప్రవర్తనకు ఫిదా అయిన అమీర్ ఖాన్.. 'లవ్ స్టోరీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్వయంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం అమీర్ ఖాన్ కు అక్కినేని ఫ్యామిలీ ప్రత్యేక విందును ఏర్పాటు చేసింది. ఇందులో నాగార్జున - నాగచైతన్య - అఖిల్ లతో పాటుగా దర్శకుడు శేఖర్ కమ్ముల - హీరోయిన్ సాయి పల్లవి - మిగతా అక్కినేని కుటుంబ సభ్యులు అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సినిమా విడుదలకు ముందే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అయితే ఈ పార్టీలో ఎక్కడా చైతన్య సతీమణి సమంత కనిపించకపోవడంతో ఊహాగానాలు జోరందుకొన్నాయి.
నాగచైతన్య తో ఉన్న విభేదాల కారణంగానే సమంత ఈ ప్రత్యేక విందుకు హాజరు కాలేదని మరోసారి పుకార్లు గుప్పుమన్నాయి. చై-సామ్ దంపతులు విడిపోతున్నారని చాలా రోజులుగా మీడియా సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఈ వార్తలపై ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. అంతేకాదు అవేమీ పట్టించుకోకుండా అక్కినేని ఫ్యామిలీ పార్టీలు, సెలబ్రేషన్స్ తో బిజీగా కనిపిస్తున్నారు. కకాకపోతే ఇందులో కోడలు సమంత కనిపించకపోవడమే చర్చనీయాంశంగా మారింది.
అమీర్ ఖాన్ లు అక్కినేని ఫ్యామిలీ ఇచ్చిన పార్టీకి సంబంధించిన ఓ ఫోటో మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే ఈ సందర్భంగా నాగ్ కాస్త ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. తన తండ్రి ఏఎన్నార్ అప్పట్లో 'బాలరాజు' అనే సినిమా చేసారని.. ఇప్పుడు 'లాల్ సింగ్ చద్దా' చిత్రంలో చైతూ పాత్ర పేరు బాలరాజు అవడం సంతోషంగా ఉందని అమీర్ ఖాన్ తో నాగ్ చెప్పినట్లు తెలుస్తోంది.