Begin typing your search above and press return to search.
అమీర్ వర్సెస్ అక్షయ్! ఈ కుట్రలు నిజమేనా?
By: Tupaki Desk | 10 Aug 2022 4:40 AM GMTఈ గురువారం రిలీజ్ కి రెడీ అవుతున్న `రక్షా బంధన్`ను బహిష్కరించాలనే హ్యాష్ ట్యాగ్ వెనక ఏదైనా కుట్ర దాగి ఉందా? అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం వెనుక అమీర్ ఖాన్ బృందం ఉందా? `బోయ్ కాట్ లాల్ సింగ్ చద్దా` ధోరణి దావానలంలా వ్యాపించడంతో తన ప్రత్యర్థి అక్షయ్ కుమార్ `రక్షా బంధన్` గెయిన్ అవుతుందని అమీర్ కుట్ర చేశారు. అందుకే `రక్షా బంధన్ ను బహిష్కరించాలి అనే ధోరణిని రెచ్చగొట్టాడు! అంటూ ప్రచారం సాగుతోంది.
అక్షయ్ కుమార్ నటించిన మూడు సినిమాలు ఈ ఏడాది థియేటర్లలో విడుదలకు రావడం ఆసక్తికరం. తాజాగా అతడు నటించిన`రక్షాబంధన్` అత్యంత క్రేజీగా థియేటర్లలో విడుదలవుతోంది. రక్షాబంధన్ ట్రైలర్ ఇప్పటికే ఆకట్టుకుంది. ఈ చిత్రం రక్షా బంధన్ పండుగను స్వాతంత్య్ర దినోత్సవం సెలవు శని-ఆదివారాలను కలుపుకుని 5 రోజుల వారాంతంలో భారీగా ఆర్జించాలనే లక్ష్యంతో బరిలో దిగుతోంది. ఆగస్టు 11న అత్యంత భారీగా ఉత్తరాది సహా ప్రపంచ దేశాల్లో ఈ చిత్రం విడుదలవుతోంది.
అయితే అదే రోజు అమీర్ ఖాన్ - కరీనా కపూర్ నటించిన `లాల్ సింగ్ చడ్డా` పోటీ బరిలో నిలుస్తోంది. కానీ ఆదిలోనే హంసపాదు తరహాలో `బోయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా` అంటూ హ్యాష్ ట్యాగ్ ప్రచారం హీటెక్కిస్తోంది. అక్షయ్ కుమార్ రక్షా బంధన్ ఎదురేలేకుండా బాక్సాఫీస్ రేసులో దూసుకెళుతుందని అమీర్ ఊహించి ఉంటాడు.. అందుకే ఇలా చేస్తున్నాడు!! అన్న ప్రచారం సాగుతోంది.
అందుకే రక్షా బంధన్ నిషేధంపై హ్యాష్ ట్యాగ్ పుట్టుకొచ్చిందన్న వాదనా బలపడింది. అంతేకాదు లాల్ సింగ్ చడ్డా కంటే రక్షాబంధన్ ఓపెనింగుల్లో వెనుదిరగకుండా దూసుకెళుతుందన్న ప్రచారం కూడా వేడెక్కిస్తోంది. లాల్ సింగ్ కి ఉన్న తక్కువ హైప్ కారణంగా ఇది సాధ్యమని భావిస్తున్నారు.
కారణం ఏదైనా ప్రస్తుతం నెటిజనుల్లో ఒక ఆసక్తికర డిబేట్ స్టార్ట్ అయ్యింది. `రక్షా బంధన్ ను బహిష్కరించాలి`` అనే ట్రెండ్ వెనుక అమీర్ ఖాన్ ఉన్నాడా? అన్నదే ఆ చర్చ. బాయ్ కాట్ లాల్ సింగ్ చద్దా ట్రెండ్ తర్వాత ఒక వారంలో ఇది ఎలా పుట్టుకొచ్చింది? #BoycottLaalSinghChaddha తర్వాత మాత్రమే ఇదెలా వెలుగులోకి వచ్చింది. ఇంతగా ప్రమాదకర స్థాయిలో ఈ ఉద్యమం పెరగడం వెనక ఎవరున్నారు? అంటూ విశ్లేషణ సాగుతోంది. అమీర్ ఖాన్ అతని బృందం లాల్ సింగ్ చద్దాకు వ్యతిరేకంగా పుట్టించిన ప్రచారాన్ని ఎదుర్కోవడానికి #బాయ్ కాట్ రక్షాబంధన్ ధోరణి వెనుక ఉండే అవకాశం ఉంది అంటూ ముంబై మీడియాలు కథనాలు వెలువరిస్తున్నాయి.
రక్షా బంధన్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల వెనుక వేరే కారణం ఏదీ ఉండదు. రక్షా బంధన్ రచయిత కనికా ధిల్లాన్ దీనిపై సందేహం వ్యక్తం చేశారన్న గుసగుసా ఇప్పుడు వైరల్ అవుతోంది. హఠాత్తుగా అక్షయ్ కుమార్ -భూమి పెడ్నేకర్ నటించిన రక్షాబంధన్ చిత్రానికి ప్రపంచం వ్యతిరేకంగా ఎలా మారుతుందనే అభిప్రాయం వ్యక్తం చేసారట.
వాస్తవానికి ఇది ఒక పెద్ద కుట్రపూరిత సిద్ధాంతం అని భావిస్తున్నారట. ఆసక్తికరంగా మోదీ ప్రభుత్వానికి అక్షయ్ కుమార్ సన్నిహితుడు కాగా అమీర్ ఖాన్ వ్యతిరేకి అన్న ప్రచారం కూడా ఉంది. హిందూత్వకు అక్షయ్ సపోర్టుగా నిలుస్తుంటే దానికి అమీర్ వ్యతిరేకి అన్న ముద్ర కూడా పడింది. అందుకే ఎప్పటికప్పుడు నెటిజనుల్లో ఇలాంటి ప్రచారం కనిపిస్తోంది.
కానీ ఇవన్నీ ప్రస్తుతానికి గుసగుసలు మాత్రమే. ఈ గుసగుసల వల్ల కూడా ఇరు సినిమాలకు ప్రచారం కలిసొస్తోంది. పరిశ్రమలోని ఇద్దరు బిగ్ ప్లేయర్స్ ఇలాంటి విచారకరమైన చర్యలను ఆశ్రయించే రోజు రాకూదని మనమంతా ఆశిద్దాం.