Begin typing your search above and press return to search.
బాలీవుడ్ దిగ్గజ దంపతులకు స్వైన్ ఫ్లూ
By: Tupaki Desk | 7 Aug 2017 5:09 AM GMTబాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్.. ఆయన సతీమణి కిరణ్ రావులకు స్వైన్ ఫ్లూ సోకింది. ప్రస్తుతం వారిద్దరికి దీనికి సంబంధించిన చికిత్సను ముంబయిలోని ఆయన స్వగృహంలోనే అందిస్తున్నారు. ఈ విషయం తాజాగా బయటకు వచ్చింది. మహారాష్ట్రలోని ఫూణెలో అమీర్‌కు చెందిన పానీ ఫౌండేషన్ నేతృత్వంలో నిర్వహించే సత్యమేవ జయతే వాటర్ కప్ 2017 బహుమతుల ప్రదాన కార్యక్రమానికి అమీర్ దంపతులు హాజరు కాలేదు.
ఈ సందర్భంగా ఆయన లైవ్ వీడియోలో మాట్లాడుతూ.. తనకూ.. తన సతీమణి కిరణ్ రావులకు స్వైన్ ఫ్లూ సోకినట్లుగా తేలిందన్నారు. ఇతరులకు తన ద్వారా అసౌకర్యాన్ని కలిగించకూడదనే తాను అవార్డు ఫంక్షన్ కు రాలేకపోయినట్లుగా చెప్పారు.
ఈ అవార్డు ఫంక్షన్ కు అమీర్ కు బదులుగా బాలీవుడ్ బాద్షా షారుక్ హాజరయ్యారు. ఇదే విషయాన్ని అమీర్ చెబుతూ.. తాను రాలేకపోయినప్పటికీ స్నేహితుల దినోత్సవం సందర్భంగా తనకు బదులుగా తన స్నేహితుడు హాజరు కావాలని కోరానని.. ఆయన సంతోషంగా ఓకే చెప్పినట్లుగా పేర్కొన్నారు. కష్టంలో ఉన్న స్నేహితుడికి అసరాగా నిలవటానికి మించింది ఏం ఉంటుంది? అది కూడా.. స్నేహితుల దినోత్సవం వేళలో..!