Begin typing your search above and press return to search.

కిరణ్‌ రావు మొహం బోర్‌ కొట్టిందని అమీర్‌ చెప్పాల్సింది

By:  Tupaki Desk   |   10 July 2021 1:30 AM GMT
కిరణ్‌ రావు మొహం బోర్‌ కొట్టిందని అమీర్‌ చెప్పాల్సింది
X
బాలీవుడ్‌ స్టార్‌ అమీర్ ఖాన్‌ తన రెండవ భార్య కిరణ్‌ రావుకు విడాకులు ఇచ్చిన నేపథ్యంలో బాలీవుడ్‌ మీడియా నుండి గల్లీ మీడియా వరకు... ప్రముఖుల నుండి పనికిమాలిన వాళ్ల వరకు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు కామెంట్స్ చేస్తున్నారు. అమీర్ ఖాన్‌ నిర్ణయాన్ని కొందరు గౌరవిస్తే కొందరు మాత్రం ఆయన తీరును విమర్శిస్తున్నాడు. ప్రతి 15 సంవత్సరాలకు అమీర్ ఖాన్‌ కు భార్య అంటే మోజు తీరుతుందా.. ఇప్పుడు మరోకరిని పెళ్లి చేసుకుని 15 ఏళ్ల పాటు ఆమెతో ఉండి మళ్లీ విడాకులు తీసుకుంటాడా అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నాడు. అమీర్ ఖాన్‌ విషయమై బాలీవుడ్‌ ఫిల్మ్‌ క్రిటిక్‌ కమ్‌ నటుడు కమల్‌ ఆర్‌ ఖాన్‌ స్పందించాడు.

ఆయన ఈ విషయమై.. అమీర్‌ భార్య మొదటి భార్య రీనా దత్తా కు మరియు రెండవ భార్య కిరణ్‌ రావుకు కూడా 15 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత విడాకులు ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టే ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎప్పుడు కూడా ఆర్థిక పరమైన విషయాల గురించి ఆలోచించలేదు. ఆయన అసలు డబ్బు గురించి ఆలోచించే వ్యక్తి కాదు. అందుకే ఈసారి ఆయన రెండవ విడాకులకు గాను కిరణ్‌ రావుకు భారీ మొత్తంలో భరణం ఇవ్వాల్సి రావచ్చు. అది ఆయనకు ఆమోద యోగ్యంగా ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను.

నీతి నిజాయితీకి పేరు అన్నట్లుగా మాట్లాడే అమీర్ ఖాన్‌ తన విడాకుల విషయంలో కూడా నీతిగా ప్రకటన చేసి ఉంటే బాగుండేది. ఆయన ఏదో కారణం చెప్పకుండా నేరుగా నాకు ఈ కళ్ల జోడు అమ్మాయి మొహం చూసి బోర్‌ కొట్టింది.. ఈమెను కాకుండా కొత్త వారిని జీవితంలో కోరుకుంటున్నాను అంటూ చెప్పి విడాకుల ప్రకటన చేయాల్సి ఉంది. కిరణ్‌ రావు వంటి ఒక సామాన్యమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్న సమయంలో చాలా మంది ఎలా అమీర్‌ ఈమెను వివాహం చేసుకున్నాడు.

కళ్ల జోడు లేకుండా చూడలేని ఈమెను ఎలా మెచ్చాడని అంతా అనుకున్నారు. ఇప్పుడు ఆయనకు ఆమె నచ్చలేదు. అందుకే విడాకులు తీసుకుంటున్నాడేమో అంటూ కమల్‌ ఆర్ ఖాన్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అమీర్ ఖాన్‌ వంటి వ్యక్తి కత్రీనా కైఫ్‌ లేదా ఫాతిమ సనా షేక్‌ వంటి అందె గత్తెలను చేసుQకోవాలి కాని అప్పట్లో ఎలా కిరణ్‌ రావును చేసుకున్నాడో అర్థం కాలేదు అన్నట్లుగా ఆయన తన వీడియోలో కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఫాతిమా సనా షేక్‌ అమీర్ ఖాన్‌ మీద వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆయన ఆ పేరును ప్రస్థావించడం మరింతగా చర్చనీయాంశం అయ్యింది.