Begin typing your search above and press return to search.
మోహన్ లాల్ మరోసారి మెస్మరైజ్ చేశాడే!
By: Tupaki Desk | 5 Feb 2022 4:48 AM GMTమలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ వయసులోను అక్కడి యంగ్ స్టార్ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు. వరుసగా వైవిధ్యభరితమైన కథలను .. భారీ ప్రాజెక్టులను ఎంపిక చేసుకుంటూ వెళుతున్నారు. మొదటి నుంచి కూడా తన కథల ఎంపిక విషయంలో మోహన్ లాల్ ఎంతో శ్రద్ధ పెడుతూ వచ్చారు. అందువల్లనే మోహన్ లాల్ సినిమా అంటే కొత్త పాయింట్ ఏదో ఉంటుందనే ఒక నమ్మకం ప్రేక్షకులలో కనిపిస్తుంది. ఆ నమ్మకానికి తగినట్టుగానే ఆయన ఎప్పటికప్పుడు వాళ్లను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు .. భారీ విజయాలు తన బరిలో దిగేలా చూసుకుంటున్నారు.
మలయాళంలో ఆయన తాజా చిత్రంగా 'ఆరట్టు' సినిమా రూపొందింది. సజీశ్ మంజిరే నిర్మించిన ఈ సినిమాకి ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించాడు. ఉదయ్ కృష్ణ కథను అందించిన ఈ సినిమాకి రాహుల్ రాజ్ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ సీన్ తోనే ఈ ట్రైలర్ ను మొదలుపెట్టారు. "అయామ్ నాట్ ఎ గ్యాంగ్ స్టర్ .. అయామ్ నాట్ ఎ మాన్ స్టర్ .. అయామ్ సినీ స్టార్ .. అయామ్ లూసిఫర్ .. నేను చాలా డేంజర్" అంటూనే విలన్ గ్యాంగ్ ను దడదడలాడించేయడం ఈ ట్రైలర్ లో చూపించారు.
ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలపైనే ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఆయన పాత్రలో కామెడీ యాంగిల్ ఉందనే హింట్ కూడా ఇచ్చారు. ఇక ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా శ్రద్ధా శ్రీనాథ్ కనిపించనుంది. మోహన్ లాల్ విలన్ గ్యాంగ్ ను ఎడా పెడా ఆడేసుకుంటూ వెళుతుంటే ఆమె మాత్రం ఏదో విషయంపై టెన్షన్ పడుతున్నట్టుగా చూపించారు. మోహన్ లాల్ తో తలపడే ప్రధానమైన విలన్ గా రామచంద్రరాజు కనిపించాడు. మొత్తం మీద ఈ ట్రైలర్ తో సినిమాపై ఆసక్తిని పెంచడంలో టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి.
ఇక కథాకథనాల పరంగా .. బడ్జెట్ పరంగా ఇది మోహన్ లాల్ స్థాయికి తగిన సినిమానే. అందువలన తారాగణం కాస్త భారీగానే కనిపిస్తుంది. శ్రద్ధా శ్రీనాథ్ తో పాటు మాళవిక మీనన్ .. నేహా సక్సేనా .. సంజనా గల్రాని .. సంపత్ రాజ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో ఒక స్టేజ్ షోలో భాగంగా ఏఆర్ రెహ్మాన్ కూడా కనిపించనుండటం విశేషం. మోహన్ లాల్ కి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. అందువలన ఈ సినిమా తెలుగులోను విడుదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.