Begin typing your search above and press return to search.
ఆ ప్రేమకు కన్నీళ్లు పెట్టుకున్న ఐష్
By: Tupaki Desk | 25 March 2016 9:30 AM GMTప్రపంచ సుందరిగా కోట్లాది మంది మనసు దోచుకోవటమే కాదు.. పెళ్లి తర్వాత తెర మీద చెలరేగిపోయిన ఐశ్వర్యారాయ్ ను అందానికి ఐకాన్ మాత్రమే కాదు.. మంచి మనిషి కూడా. తన పని తాను చేసుకుంటూ పోవటం.. పిల్లా.. భర్త.. కుటుంబం అన్నట్లుగా ఉండటమే కాదు.. ప్రొఫెషనల్ గా పని చేసుకుంటూ పోవటంలో ఐష్ తర్వాతే ఎవరైనా.
మాజీ ప్రపంచ సుందరన్న భావన అస్సలు కలగనీయకుండా సాదాసీదాగా ఉండే ఆమె.. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ తల్లిపాత్రకు నూటికి నూరుశాతం న్యాయం చేస్తోంది. ఐష్ కష్టాన్ని ఆమె కూతురు గుర్తించినట్లుంది. తాజాగా ఐష్ కుమార్తె అరాధ్య చేసిన ఒక పనికి ఈ మాజీ ప్రపంచ సుందరి కంట కన్నీరు ఆగలేదంట.
ప్రస్తుతం సరబ్జీత్ చిత్రంలో నటిస్తున్న ఆమె.. అనారోగ్యానికి గురి కావటంతో షూటింగ్ కు సెలవు పెట్టేసి ఇంటికి వచ్చేసింది. ఒంట్లో బాగుండకపోయినా.. ముంబయిలో ఉంటే మాత్రం.. కూతురు స్కూలు వదిలే సమయానికి తానే స్వయంగా వెళ్లి వెంట బెట్టుకురావటం ఐష్ కు అలవాటు.
అందులో భాగంగా తాజాగా స్కూల్ కి వెళ్లిన ఆమెకు.. అరాధ్య షాకింగ్ గిఫ్ట్ ఇచ్చిందట. తల్లి అనారోగ్యాన్ని గుర్తించిన అరాధ్య.. క్లాస్ రూమ్ లో ‘‘గెట్ వెల్ సూన్’’ అంటూ రాసిన ఒక కార్డును తయారు చేసి ఆమెకు ఇచ్చిందట. తన మీద కుమార్తె ప్రదర్శించిన ప్రేమకు ఐష్ కంట ఆనందభాష్పాలు ఆగలేదంట. ఒక తల్లికి అంతకుమించి కావాల్సిందేముంది?