Begin typing your search above and press return to search.

ఐష్ ఎంత ప్రేమిస్తోందో చూశారా?

By:  Tupaki Desk   |   1 April 2016 12:10 PM IST
ఐష్ ఎంత ప్రేమిస్తోందో చూశారా?
X
నిజ జీవితంలో అయినా, సినిమాల్లో అయినా అమ్మ ప్రేమకు మించిన మరో ప్రేమను చూడలేం, చూపించలేం. తల్లి తన బిడ్డలపై ఉన్న ప్రేమను ఎక్స్ ప్రెస్ చేయడం, బిడ్డలు కూడా వారికి తమ ఇష్టాన్ని ప్రదర్శించే సన్నివేశాలు ఎన్నో చూస్తుంటాం. తల్లి తన పిల్లలను అప్యాయంగా చూసుకోవడం, ముద్దాడడం చాలా సహజమైన విషయం.

బాలీవుడ్ సుందరాంగి - మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్ తన కూతురు ఆరాధ్యను ఏ రేంజ్ లో చూసుకుంటుందో గతంలో చాలాసార్లు జనాలకు తెలిసొచ్చింది. ఒకవైపు సినిమాపై కమిట్ మెంట్ ప్రదర్శిస్తూనే.. ఆరాధ్యను షూటింగ్ కు తీసుకొచ్చి షాట్ గ్యాప్ లో సపర్యలు చేసేది. మరి ఈ తల్లీ కూతుళ్లిద్దరూ హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ఎలా ఉంటాయో.. ఐశ్వర్య భర్త అభిషేక్ బచ్చన్ అభిమానులకు చూపించాడు.

ఐష్ - ఆరాధ్యలు ఒకరినొకరు ముద్దాడుతున్న ఫొటోను అభిషేక్‌ బచ్చన్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో ఐశ్వర్యరాయ్‌ తన గారాల పట్టీ ఆరాధ్యను ముద్దాడుతోంది. అందరినీ ఆకట్టుకునేలా ఇంత చక్కగా ఉన్న ఈ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ అద్భుతమైన సన్నివేశం చూడముచ్చటగా ఉంది. ఆదర్శ తల్లికూతుళ్లు అంటూ అభిమానుల నుంచి తెగ కామెంట్స్‌ వస్తున్నాయి.