Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ : ఆరడుగుల బుల్లెట్
By: Tupaki Desk | 8 Oct 2021 12:44 PM GMTచిత్రం : 'ఆరడుగుల బుల్లెట్'
నటీనటులు: గోపీచంద్-నయనతార-ప్రకాష్ రాజ్-అభిమన్యు సింగ్-రమాప్రభ-బ్రహ్మానందం-కోట శ్రీనివాసరావు-జయప్రకాష్ రెడ్డి తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: ఎం.బాలమురుగన్
కథ: వక్కంతం వంశీ
మాటలు: అబ్బూరి రవి
నిర్మాత: తాండ్ర రమేష్
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బి.గోపాల్
ఎప్పుడో ఏడెనిమిదేళ్ల కిందట మొదలైన సినిమా ‘ఆరడుగుల బుల్లెట్’. రకరకాల కారణాల వల్ల మేకింగ్.. రిలీజ్ ఆలస్యమై.. ఎట్టకేలకు శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో సీనియర్ దర్శకుడు బి.గోపాల్ రూపొందించిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
శివ (గోపీచంద్) 30 ఏళ్ల వయసొచ్చినా బాధ్యత లేకుండా ఆవారాగా తిరిగే కుర్రాడు. అతడి తీరు తండ్రి నిత్యానంద్ (ప్రకాష్ రాజ్)కు ఏమాత్రం నచ్చదు. ఎప్పుడూ కొడుకును తిడుతూ, అసహ్యించుకుంటూ ఉంటాడు. శివ చేసిన ఒక పని వల్ల చివరికి అతణ్ని ఇంటి నుంచి కూడా వెళ్లగొడతాడు తండ్రి. ఐతే కాశి (అభిమన్యు సింగ్) అనే గూండా వల్ల నిత్యానంద్ కు పెద్ద సమస్య తలెత్తడంతో అప్పుడు శివనే అడ్డం పడతాడు. దీంతో కాశితో శివకు కయ్యం మొదలవుతుంది. మరి కాశితో తలపడి శివ ఎలా గెలిచాడు.. ఈ క్రమంలో తండ్రికి ఎలా చేరువయ్యాడు అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
ఆరడుగుల బుల్లెట్’ సినిమా ప్రథమార్ధంలో ఎమ్మెస్ నారాయణ కామెడీ చూస్తాం. ద్వితీయార్ధంలో జయప్రకాష్ రెడ్డి కూడా కామెడీ చేశారు. మధ్యలో గుండు హనుమంతరావు కూడా కనిపించారు. ఈ ముగ్గురూ ఇప్పుడు మన మధ్య లేరు. ఇక ఈ మధ్య సినిమాల్లో కనిపించడమే మానేసిన బ్రహ్మానందం.. తన ప్రైమ్ టైంలో ఉన్నప్పటి తరహా కామెడీ రోల్లో కనిపించారు. ఇక కొన్నేళ్ల కిందటే ఆగిపోయిన ధూమపానానికి వ్యతిరేకంగా రాహుల్ ద్రవిడ్ రనౌట్ యాడ్.. రెండు గాజుల యాడ్ కూడా ఈ సినిమా ఆరంభంలో.. చివర్లో కనిపిస్తాయి. ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమా ఇప్పటిది కాదని.. చాలా పాతబడిపోయిందని.. చెప్పడానికి ఇవన్నీ సూచికలుగా భావించవచ్చు. ఇది ఏడెనిమిదేళ్ల కిందట మొదలైన సినిమా. స్క్రిప్టు అంతకు ఒకట్రెండేళ్ల ముందే పూర్తయి ఉండొచ్చేమో. అయితే సినిమా చూస్తున్నంతసేపూ కలిగే సందేహం ఏంటంటే.. పదేళ్ల ముందే ఈ సినిమా వచ్చి ఉన్నా ఆడేదా అని. ఆ సమయానికి కూడా ఔట్ డేటెడ్ అనిపించే మూస కథాకథనాలతో తెరకెక్కిన ‘ఆరడుగుల బుల్లెట్’ ఇప్పటి రోజుల్లో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
రెండు దశాబ్దాల కిందట ‘నరసింహనాయుడు’ మూవీతో చివరి విజయాన్నందుకున్న సీనియర్ దర్శకుడు బి.గోపాల్.. ఆ తర్వాత ఎలాంటి సినిమాలు తీశారో అందరికీ తెలిసిందే. ఆయన్నుంచి ప్రస్తుత ట్రెండుకు తగ్గ కొత్త తరహా సినిమాను ఎవరూ ఆశించే సాహసం చేయరు. కాకపోతే ‘ఆరడుగుల బుల్లెట్’కు అందించింది వక్కంతం వంశీ కాబట్టి అతనేమైనా ప్రత్యేకత చూపించి ఉంటాడేమో.. తన స్టయిల్లో టిపికల్ హీరో క్యారెక్టరైజేషన్ తో ఏమైనా మెరుపులు మెరిపించాడేమో.. కథలో ఏదైనా విశేషం ఉందేమో అని చూస్తే.. పూర్తి నిరాశే మిగులుతుంది. ఆవారాగా తిరిగే కొడుకు.. అతడికి బాధ్యత లేదని ఎప్పుడూ తిడుతూ ఉండే తండ్రి.. కొడుకును అవమానించి ఇంటి నుంచి బయటికి పంపేస్తే.. ఆ తండ్రికి కష్టం వచ్చినపుడు కొడుకే ఆదుకునే పరమ రొటీన్ స్టోరీతో తెరకెక్కిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. ఈ సినిమా రిలీజ్ ముంగిట బి.గోపాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ తరహాలో చాలా కథలే వచ్చాయని తనే ఒప్పుకున్నాడు. కథే ఇంత రొటీన్ గా.. సాధారణంగా ఉండటంతో గోపాల్ కూడా కొత్తగా చేయడానికి ఏమీ లేకపోయింది. తన స్టయిల్లో మాస్ అంశాల్ని ఎలివేట్ చేస్తూ ఒక ఫార్మాట్లో సినిమా తీసుకుంటూ వెళ్లిపోయారాయన. యాక్షన్ సినిమాలకు పేరుబడ్డ గోపీచంద్.. వీర లెవెల్లో ఫైట్లు చేస్తుంటే.. భారీ డైలాగులు కొడుతుంటే.. మాస్ ప్రేక్షకులు కొంత మేర ఎంజాయ్ చేస్తారేమో కానీ.. కథాకథనాల పరంగా ఏమాత్రం కొత్తదనం.. ఆసక్తి లేని ‘ఆరడుగుల బుల్లెట్’ సగటు ప్రేక్షకులకు మాత్రం శిరోభారంగానే అనిపిస్తుంది.
ఎంత మాస్ సినిమా అయినా సరే.. హీరో-విలన్ కు మధ్య ఘర్షణ మొదలయ్యాక ఎత్తులు పై ఎత్తులతో వారి మధ్య వార్ ఎగ్జైటింగ్ గా సాగాలని కోరుకుంటాం. కానీ ఇందులో అది పూర్తిగా మిస్ అయింది. బెజవాడను గుప్పెట్లో ఉంచుకున్న విలన్.. హీరో చేతిలో చావు దెబ్బ తినగానే చల్లబడిపోతాడు. అతడి తమ్ముడొచ్చి హీరో తండ్రికి వార్నింగ్ ఇస్తే.. అతణ్ని కూడా హీరో చావబాది పడుకోబెట్టేస్తాడు. ఇక విలన్ తర్వాతేం చేస్తాడా అని చూస్తే.. రొటీన్ గా హీరో పక్కన లేని టైం చూసి తన ఫ్యామిలీ మీద ఎటాక్ చేస్తాడు. తర్వాత హీరో ఫ్యామిలీ వైపు నుంచి కాంప్రమైజ్.. చివరికి పెద్ద ఫైటు.. ఇలా ప్రతి దశలోనూ రొటీన్ సన్నివేశాలతో ‘ఆరడుగుల బుల్లెట్’ అసహనానికి గురి చేస్తుంది. ద్వితీయార్ధం ఇలా విసిగిస్తే.. ప్రథమార్ధంలో హీరో-విలన్ క్లాష్ కు ముందు కథానాయకుడి కుటుంబ నేపథ్యంలో వచ్చే సీన్లు.. అతడి ప్రేమాయాణం మరో రొకమైన తలనొప్పి. తొలి చూపులోనే కథానాయికతో ప్రేమలో పడిపోవడం.. ఆమెకు అబద్ధం చెప్పి దగ్గరవడం.. ఇలా దశాబ్దాలుగా చూస్తున్న రొటీనే ప్రేమకథే ఇందులోనూ కనిపిస్తుంది. ప్రతి పావు గంటకు గంట కొట్టినట్లు వచ్చి పడే పాటల సంగతి సరే సరి. ప్రతి పాటకూ హీరో హీరోయిన్లు ఫారిన్ లొకేషన్ కు వెళ్లిపోయి.. రొటీన్ గా స్టెప్పులేయడం చికాకు పెడుతుంది. ఇంటర్వెల్ దగ్గర హీరో.. విలన్ని దెబ్బ కొట్టే ఒక్క సీన్ మాత్రం మాస్ ను కొంతమేర ఎంగేజ్ చేస్తుంది కానీ.. మిగతా సినిమాలో ఆ వర్గం ప్రేక్షకులకు మెచ్చే అంశాలు కూడా లేవు. ఎంత తక్కువ అంచనాలతో వచ్చినా కూడా నిరాశకు గురి చేసే ఔట్ డేటెడ్ మూవీ ‘ఆరడుగుల బుల్లెట్’ అనడంలో మరో మాట లేదు.
నటీనటులు:
గోపీచంద్ మాస్ పాత్రల్లో ఎప్పుడూ ఎలా కనిపిస్తాడో అలాగే కనిపించాడు. శివ పాత్రలో హుషారుగానే నటించాడు. కాకపోతే ఆ పాత్రే చాలా రొటీన్ గా అనిపిస్తుంది. ఇటీవలే ‘సీటీమార్’ చూసిన వారికి ఈ చిత్రంలో గోపీని చూస్తుంటే ప్రతి నిమిషం ఇది పాత సినిమా అనే విషయం తడుతూనే ఉంటుంది. నయనతార సైతం అలాగే కనిపించింది. ఇప్పుడు ఆమెకున్న ఇమేజ్ తో ఈ సినిమా చూసి జీర్ణించుకోవడం కష్టమే. ప్రకాష్ రాజ్ ఇలాంటి పాత్రలు కోకొల్లలుగా చేశారు. కానీ తన పాత్రకు ఆయన న్యాయం చేశారు. అభిమన్యు సింగ్ విలనీ రొటీన్ గా అనిపిస్తుంది. బ్రహ్మానందం... ఎమ్మెస్ నారాయణల కామెడీ గురించి చెప్పడానికేమీ లేదు. మిగతా నటీనటులంతా మామూలే.
సాంకేతిక వర్గం:
మణిశర్మ మధ్యలో ఫామ్ కోల్పోయిన టైంలో చేసిన ఆల్బం ఇది. అందుకు తగ్గట్లే ఉన్నాయి పాటలు. ఒక్కటీ రిజిస్టర్ కావు. ప్రతిదీ సిగరెట్ సాంగ్ లాగే అనిపిస్తుంది. నేపథ్య సంగీతం పర్వాలేదు. మాస్ సన్నివేశాలను మణిశర్మ బాగానే ఎలివేట్ చేశఆడు. బాలమురుగన్ ఛాయాగ్రహణంలో ఏ మెరుపులూ లేవు. నిర్మాణ విలువలు ఈ సినిమా తీసిన సమయానికి తగ్గట్లున్నాయి. ఉన్నంతలో బాగానే ఖర్చు పెట్టారు. ఇక కథకుడిగా వక్కంతం వంశీ నుంచి ఆశించే అంశాలేవీ ఇందులో లేవు. స్క్రిప్టు దగ్గరే తేలిపోవడంతో దర్శకుడు బి.గోపాల్ కూడా చేసిందేమీ లేకపోయింది. చాలా పాత స్టయిల్లో సినిమా తీసి సినిమాను నీరుగార్చేశాడు. అబ్బూరి రవి మాటలు కూడా సినిమాకు తగ్గట్లే ఉన్నాయి.
చివరగా: ఆరడుగుల బుల్లెట్.. ఔట్ డేటెడ్
రేటింగ్- 1.5/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre