Begin typing your search above and press return to search.

'సిటీమార్‌' : పాత సినిమా మళ్లీ తెరపైకి

By:  Tupaki Desk   |   12 Sep 2021 11:37 AM GMT
సిటీమార్‌ : పాత సినిమా మళ్లీ తెరపైకి
X
గోపీచంద్‌ హీరోగా నటించిన సిటీమార్ సినిమా వినాయక చవితి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన సిటీమార్ కు పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత గోపీచంద్‌ సినిమా కు సక్సెస్ టాక్ వినిపించింది. టాలీవుడ్‌ లో సెకండ్‌ లావ్‌ డౌన్ తర్వాత పెద్ద సక్సెస్ గా సిటీమార్ ను చెప్పుకుంటూ ఉన్నారు. మొత్తానికి వెయిటింగ్‌ చేసినా కూడా సిటీమార్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో గోపీచంద్‌ క్రేజ్ మరింత పెరిగింది. ఈ సమయంలోనే ఆయన నటించిన ఒక పాత సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే గోపీచంద్‌ మరియు నయనతార జంటగా బి గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన ఆరడుగుల బుల్లెట్‌. ఈ సినిమా గత నాలుగు అయిదు సంవత్సరాలుగా అప్పుడప్పుడు వచ్చేస్తున్నా అంటూ ఊరిస్తూ మళ్లీ కనిపించకుండా పోతుంది.

సిటీమార్ సక్సెస్ నేపథ్యంలో మళ్లీ ఆరడుగుల బుల్లెట్ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రకటించారు. యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న బి గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందించాడు. వక్కంతం వంశీ అందించిన కథతో పాటు సినిమాలో నయనతార మరియు గోపీచంద్‌ ల రొమాన్స్ ప్రధాన ఆకర్షణ గా నిలుస్తుంది అంటూ మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాను జయబాలాజీ రీల్‌ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌ పతాకంపై తాండ్ర రమేష్‌ నిర్మించారు. ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

అక్టోబర్‌ లో దసరా కానుకగా ఇప్పటికే పలు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈ సినిమా ను కూడా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఇంకా పక్క డేట్ ను ఖరారు చేయలేదు. కాని అక్టోబర్ లో మాత్రం ఒక సేఫ్‌ జోన్‌ చూసి విడుదల చేస్తారని తెలుస్తోంది. దాదాపుగా నాలుగు అయిదు సంవత్సరాలుగా మోక్షం దక్కని ఆరడుగుల బుల్లెట్‌ సినిమాకు ఈసారి అయినా మోక్షం దక్కేనా అనేది చూడాలి. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఇతర కారణాల వల్ల సినిమా పై జనాల్లో బజ్ అయితే లేదు. కాని సినిమా విడుదల సమయంకు మేకర్స్‌ ప్రమోషన్స్‌ చేస్తే జనాల దృష్టిని ఆకర్షించడంతో పాటు సిటీమార్‌ హీరో అంటూ జనాలు థియేటర్ల వైపు నడిచినా ఆశ్చర్యం లేదు. అందుకే సిటీమార్ ఇచ్చిన ధైర్యంతో ఈ సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అతి త్వరలోనే విడుదల తేదీ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.