Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ తమిళ విజేత ఎవరంటే..
By: Tupaki Desk | 1 Oct 2017 6:07 AM GMTతెలుగు ‘బిగ్ బాస్’ కంటే ముందు మొదలైంది తమిళ ‘బిగ్ బాస్’. కానీ తెలుగు ‘బిగ్ బాస్’ అయ్యాక కూడా అది కొనసాగింది. తెలుగులో ఈ షో 70 రోజుల్లో ముగిసిపోతే.. తమిళంలో మాత్రం 100 రోజుల పాటు నడవడమే ఇందుకు కారణం. ఐతే ఎట్టకేలకు ఈ షో ముగిసింది. శనివారం విజయదశమి రోజు ‘బిగ్ బాస్’ తమిళ్ తొలి సీజన్ కు తెరపడింది. అర్ధరాత్రి దాటాక ఈ షో విజేతను ప్రకటించడం విశేషం. ఈ షోలో ఆరవ్ విజేతగా నిలిచాడు.
తెలుగులో ఐదుగురు ఫైనల్ దశకు చేరగా.. తమిళంలో మాత్రం నలుగురినే తుది దశకు ఎంపిక చేశారు. ఆరవ్ కాకుండా స్నేహన్.. గణేష్ వెంకట్రామన్ (ఢమరుకం విలన్).. హరీష్ కళ్యాణ్ (కాదలి హీరో) ఫైనల్ కు అర్హత సాధించారు. ఐతే గణేష్.. హరీష్ ముందు ఎలిమినేట్ అయిపోగా.. ఆరవ్-స్నేహన్ మధ్య పోటీ నెలకొంది. చివరికి హోస్ట్ కమల్ హాసన్.. ఆరవ్ నే విజేతగా ప్రకటించాడు. కొన్నాళ్లుగా అందరూ స్నేహన్ విజేత అవుతాడని అంటుండగా.. ఆరవ్ టైటిల్ నెగ్గడం విశేషమే.
తమిళ ‘బిగ్ బాస్’కు ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఒవియా హౌస్ లో ఉణ్నపుడు ఆరవ్ ను ప్రేమించడం విశేషం. కానీ అతను మాత్రం ఆమెను అంతగా పట్టించుకోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అతను ఒవియాకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. మరి చివరికి అతను ఎలా విజేత అయ్యాడో ఏమో. ఆరంభంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న తమిళ బిగ్ బాస్.. ఒవియా వల్లే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆమె హౌస్ నుంచి వెళ్లిపోయాక కొంచెం డౌన్ అయినప్పటికీ మళ్లీ చివరి దశలో పుంజుకుంది.