Begin typing your search above and press return to search.

ఆషా ఎన్ కౌంట‌ర్ ట్రైల‌ర్.. దారుణాన్ని క‌ళ్ల‌కు క‌ట్టేలా..!

By:  Tupaki Desk   |   31 Oct 2021 5:59 AM GMT
ఆషా ఎన్ కౌంట‌ర్ ట్రైల‌ర్.. దారుణాన్ని క‌ళ్ల‌కు క‌ట్టేలా..!
X
నిజ ఘ‌ట‌న‌ల్ని తెర‌పై ఉన్న‌దున్న‌ట్టు ఆవిష్క‌రించ‌డంలో వ‌ర్మ డీకంపెనీ త‌ర్వాతే. ఇప్పుడు క‌ల్పిత క‌థ అంటూ ఆ త‌ర‌హా సినిమాని రిలీజ్ కి సిద్ధం చేయ‌డం ట్విస్టు. తాజాగా ఆషా ఎన్ కౌంట‌ర్ ట్రైల‌ర్ ని వ‌ర్మ రిలీజ్ చేశారు.

``ఈ చిత్రం ఏ వ్య‌క్తుల‌పైనా ఏ ఘ‌ట‌న‌ల పైనా ఆధార‌పడి తీయ‌లేదు.. కేవ‌లం క‌ల్పితం`` అంటూ ఇంట్రో ఇవ్వ‌డంతోనే ఆర్జీవీ కొంత రాజీప‌డినా.. ఒక ఘ‌ట‌న‌ను ఉన్న‌దున్న‌ట్టుగా చిత్రీక‌రించి రిలీజ్ చేస్తున్నార‌ని `ఆషా ఎన్ కౌంట‌ర్` ట్రైల‌ర్ చూసిన‌ అందరికీ అర్థ‌మ‌వుతుంది. ట్రైల‌ర్ లో నిర్జ‌న ప్ర‌దేశంలో యువ‌తిపై కొంద‌రు దుండ‌గుల‌ అత్యాచారం హ‌త్య అనంత‌రం విచార‌ణ‌లో భాగంగా పోలీసుల ఎన్ కౌంట‌ర్ చేసి దుండ‌గుల్ని హ‌త‌మార్చ‌డం వ‌గైరా ఘ‌ట‌న‌ల్ని క‌ళ్ల‌కు గ‌ట్టిన‌ట్టు ఆర్జీవీ బృందం తెర‌కెక్కించింది. అత్యాచారం ఎంత ఘోరంగా జ‌రిగిందో అంత‌కుమించి పోలీసులు చిత్ర‌వ‌ధ చేసి దుర్మార్గుల అంతం చూసిన వైనాన్ని క‌ళ్ల‌కు క‌ట్టింది ఈ ట్రైల‌ర్. క్రైమ్ డ్రామాకు అవ‌స‌ర‌మైన రీరికార్డింగ్ ని ఆర్జీవీ అంతే ప‌ర్ఫెక్ట్ గా తీసుకున్నారు. ఆనంద్ చంద్ర ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ఆర్జీవీ ఎగ్జిక్యూట్ చేశారు. న‌వంబ‌ర్ 26న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.

అయితే ఈ సినిమా ఓ రియ‌ల్ ఇన్సిడెంట్ ని త‌ల‌పిస్తోంద‌ని అంతా గెస్ చేస్తున్నారు. దిల్లీ ఘ‌ట‌న త‌ర్వాత హైద‌రాబాద్ ఔట‌ర్ లో దిశ అత్యాచార ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఒక యువ వైద్యురాలిని అత్యంత ఘోరంగా పాశ‌వికంగా అత్యాచారం చేసి చంపేసారు దుండ‌గులు. అయితే అందుకు ప్ర‌తీకారంగా పోలీసులు ఎన్ కౌంట‌ర్ లో నిందితుల్ని చంపేయ‌డం.. సీన్ రీక‌న్ స్ట్ర‌క్ష‌న్ లో పారిపోతుండ‌గా చంపాల్సొచ్చింద‌ని చెప్ప‌డం వ‌గైరా వ‌గైరా ఏదీ తెలుగు ప్ర‌జ‌లు మ‌ర్చిపోలేదు. ఈ ఘ‌ట‌న‌లో ఒక క‌ల్వ‌ర్ట్ వంతెన వ‌ద్ద యువ‌తిని స‌జీవ‌ద‌హ‌నం చేసిన విష‌యాన్ని ట్రైల‌ర్ లో చూపించారు. బ‌హుశా కోర్టు గొడ‌వ‌ల వల్ల ఇది క‌ల్పిత క‌థ అంటూ ఆర్జీవీ టైటిల్స్ లో వాయిస్ వినిపించార‌ని భావించ‌వ‌చ్చు.