Begin typing your search above and press return to search.
గడ్డకట్టే చలిలో రొమాంటిక్ సాంగ్ చేశారా!
By: Tupaki Desk | 12 March 2022 1:30 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ `రాధేశ్యామ్` ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా విడుదలైంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీని దర్శకుడు రాధాకృష్ణకుమార్ విజువల్ వండర్ గా రూపొందించారు. యువీ క్రియేషన్స్, టి. సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రంలోని కథకు కీలకంగా నిలిచే సెట్స్ కే 75 కోట్లు ఖర్చు చేశారంటే ఏ స్థాయి గ్రాండియర్ లుక్ కోసం ప్రయత్నించారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వండర్ ఫుల్ మూవీ కోసం ప్రేక్షకులు, అభిమానులు గత కొంత కాలంగా ఎదురుచూశారు.
మొత్తానికి వారి ఎదురుచూపులకు ఎండ్ పడింది. సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వినిపిస్తోంది. ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబమంధించిన ఆసక్తికరమైన న్యూస్ ఒకటి ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. సినిమాలోని ప్రతీ సన్నివేశాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన మేకర్స్ ఓ పాటని మాత్రం మైనస్ డిగ్రీ చలిలో తెరకెక్కించారట. సినిమాలో `ఆషికీ ఆగయీ .. అంటూ సాగే ఓ పాట వున్న విషయం తెలిసిందే.
ఈ పాటలో హీరో ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డే నటించారు. ఈ పాటని గడ్డకట్టే చలిలో మైనస్ 2 ఉష్ణోగ్రత లో చిత్రీకరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శుక్రవారం విడుదలైన సినిమాపై దేశ వ్యాప్తంగా మిశ్రమ వస్తున్న వేళ `ఆషికీ ఆగయీ .. అంటూ సాగే పాటని చిత్రీకరించిన విధానంపై చర్చ జరుగుతోంది. ఈ పాటని ఇటలీలో చిత్రీకరించారట. ఆ గ్రాండీయర్ ఈ పాటని మరింత హైలైట్ చేసిందని చెబుతున్నారు.
మైనస్ 2 డిగ్రీ చలిలో ప్రభాస్, పూజా హెగ్డే అద్భుతంగా ఈ పాటకు పెర్ఫార్మ్ చేశారని, ఇటలీలోని హిల్ స్టేషన్ లో ఈ పాటని రైన్ పడుతుండగా చిత్రీకరించారని, ఎక్సట్రీమ్ కండీషన్స్ లో ఈ పాటని చిత్రీకరించడం అద్ంభుతం అని ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాలో వన్ ఆఫ్ ద హిట్ సాంగ్ గా నిలిచిన ఈ పాట బుట్టబొమ్మ పూజా హెట్డే లోని కొత్త యాంగిల్ ని చూపించిందని, సినిమాలో ప్రేరణ పాత్రలో నటించిన పూజా ప్రేక్షకుల మనసుల్ని దోచేసిందని ఆమెని ప్రశంసిస్తున్నారు. పూజా హెగ్డే ప్రస్తుతం విజయ్ తో బీస్ట్, రామ్ చరణ్ తో `ఆచార్య` వంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది.