Begin typing your search above and press return to search.

వరల్డ్ బిగ్గెస్ట్ మూవీకి ఆంధ్రా అమ్మాయే

By:  Tupaki Desk   |   30 Nov 2017 4:28 AM GMT
వరల్డ్ బిగ్గెస్ట్ మూవీకి ఆంధ్రా అమ్మాయే
X
హాలీవుడ్ డ్రీమ్స్ అందరికీ ఉంటాయి. కానీ వాటిని నెరవేర్చుకునే స్థాయిని అందుకోవడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఓ ఆంధ్రా అమ్మాయి ప్రపంచంలోనే అతి పెద్ద చిత్రంగా రూపొందుతున్న మూవీకి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయడం అంటే.. నిజంగా ప్రశంసించాల్సిన విషయమే.

ఆశ్రితా కామత్ అనే యంగ్ గాళల్.. ఇ్పపుడు జేమ్స్ కేమరాన్ దర్శకత్వంలో రూపొందుతున్న అవతార్ 2 చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తోంది. ప్రపంచంలోనే నెంబర్1 ఫిలిం ఇనిస్టిట్యూట్ అయిన.. అమెరికన్ ఫిలిం ఇనిస్టిట్యూట్ నుంచి ప్రొడక్షన్ డిజైన్ లో ఎంఎఫ్ ఏ చేసింది ఆశ్రిత. ఆమె చేసిన మొదటి థీసిస్ ఫిలిమ్ 'ఇంటర్ స్టేట్'కు 2014లో 41వ స్టూడెంట్ అకాడమీ అవార్డ్స్ లో రజిత పతకం లభించింది. రెండో థీసిస్ ఫిలిం 'డస్ట్ ల్యాండ్'.. బెస్ట్ ప్రొడక్షన్ అండ్ ఆర్ట్ డిజైన్ విభాగంలో ఫిలింక్వెస్ట్ కు నామనిటే అయింది. ఆశ్రిత తల్లి గ్రాఫిక్ డిజైనర్ కాగా.. తనకు తొలి టీచర్ తన అమ్మే అంటుంది ఆశ్రిత కామత్.

గతంలో జిందగీ న మిలేగీ దుబారా చిత్రానికి ప్రాపర్టీ మాస్టర్ గా వర్క్ చేసిన తర్వాత.. హాలీవుడ్ లో స్కల్ ఐలాండ్.. ఐ సీ యు.. పసిఫిక్ రిమ్:అప్రైజింగ్ తో పాటు స్టీవెన్ స్పీల్ బర్గ్ మూవీ బీఎఫ్‌ జీ కి కూడా వర్క్ చేసింది. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న జేమ్స్ కామరాన్ ముూవీ అవతార్2 కు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తోంది. తనకు ఇంతగా గుర్తింపు లభిస్తోందంటే.. అందుకు కారణం తన కుటుంబం అంటోంది ఆశ్రితా.