Begin typing your search above and press return to search.
ఆటగధరా శివ.. కొత్తగా ఉందే
By: Tupaki Desk | 7 Jun 2018 6:35 AM GMTచచ్చేవాడు.. చంపేవాడు కలిసి తిరుగుతున్నారు. ఇదొక్క లైన్ సినిమా తాలూకు అర్ధాన్ని చెప్పేసింది. చంద్ర సిద్దార్థ్ దర్శకత్వం వహించిన ఆటగధరా శివ అనే సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. సినిమా చాలా డిఫెరెంట్ గా ఉందని అనిపిస్తోంది. మంచి చిత్రాలను తీయడంలో ముందుడే దర్శకుడు చంద్ర సిద్దార్థ్ ఈ సారి మరో కొత్త ప్రయత్నమే చేస్తున్నాడు. హ్యాంగ్ మ్యాన్ జీవిత ఆధారంగా సినిమా కథ నడుస్తుంది.
ప్రత్యేక ఆకర్షణగా సినిమాలో జబర్దస్త్ హైపర్ ఆది కనిపిస్తున్నాడు. కామెడీ పంచులతో స్పెషల్ ఎట్రాక్షన్ కలిగిస్తున్నాడనే చెప్పాలి. మరికొంత మంది కమెడియన్స్ కూడా సినిమాలో కనిపిస్తున్నారు. ఉరి తీయడానికి ప్రభుత్వం నుంచి లేఖను అందుకున్న ఒక హ్యాంగ్ మ్యాన్ - జైలు నుంచి తప్పించుకున్న ఉరిశిక్ష ఖైదీ ఇద్దరు కలిసి ఎలా ముందుకు సాగారు అనే లైన్ చాలా ఆసక్తిని కలిగిస్తోంది. తప్పకుండా సినిమా ఓ వర్గం వారిని థియేటర్ వరకు రప్పించగలదు.
గతంలో చంద్ర సిద్దార్థ్ ఆ నలుగురు వంటి సినిమాతో మంచి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో మరణించిన మనిషి తాలూకు కథ నడిస్తే ఈ సినిమాలో మరణించడానికి రెడీగా ఉన్న వ్యక్తితో హ్యాంగ్ మ్యాన్ ప్రయాణం ఇంట్రెస్టింగ్ పాయింట్. "టైమ్ కు వచ్చేడు దేవుడు కాదు.. యముడు" అనే డైలాగ్ కూడా బావుంది. మరి ఆటగదరా శివ ఆ నలుగురు స్థాయిలో ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.