Begin typing your search above and press return to search.
నారా రోహిత్ సినిమాకు ముహూర్తం కుదిరింది
By: Tupaki Desk | 3 Aug 2018 5:39 AM GMTతెలుగులో చాలా వేగంగా సినిమాలు చేసే కథానాయకుల్లో నారా రోహిత్ ఒకడు. కొన్నేళ్లుగా ప్రతి ఏడాదీ అతడి సినిమాలు కనీసం మూడు రిలీజవుతున్నాయి. ఐతే ఈ మధ్య అతను కొంచెం స్పీడు తగ్గించాడు. వరుస ఫెయిల్యూర్లతో గ్యాప్ తీసుకున్నాడు. త్వరలోనే అతడి జోరు మళ్లీ మొదలు కానుంది. వరుసగా సినిమాలు విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ముందు అతడి నుంచి రాబోయే సినిమా ‘ఆటగాళ్ళు’. సీనియర్ నటుడు జగపతి బాబు కలయికలో రోహిత్ చేసిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఆగస్టులోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 24న ‘ఆటగాళ్ళు’ విడుదలవుతుందని నిర్మాతలు ప్రకటించారు.
ఈ నెలలో తొలి వారం నుంచి వరుసగా పేరున్న సినిమాలు రిలీజవుతున్నాయి. మరి వీటి మధ్య ‘ఆటగాళ్ళు’ ఎలా ప్రత్యేకత చాటుకుంటుందో చూడాలి. గతంలో ‘పెదబాబు’.. ‘ఆంధ్రుడు’ లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న పరుచూరి మురళీ చాలా గ్యాప్ తర్వాత తీసిన సినిమా ఇది. ఇందులో రోహిత్ సినీ దర్శకుడిగా నటిస్తుంటే.. జగపతిబాబు క్రిమినల్ లాయర్ పాత్రలో కనిపించనున్నాడు. వీళ్ల కలయికే సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. వీరి పాత్రలు కూడా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. ఒక మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈ చిత్రం నడుస్తుంది. రోహిత్ సరసన ఓ కొత్తమ్మాయి నటించిన ‘ఆటగాళ్ళు’ చిత్రాన్ని నలుగురు కొత్త నిర్మాతలు కలిసి నిర్మించారు. మరోవైపు రోహిత్ ‘వీర భోగ వసంత రాయలు’ అనే మల్టీస్టారర్ మూవీలో ఒక వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. దీని తర్వాత అతను ‘బాణం’ ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో ‘అనగనగా దక్షిణాదిలో’ అనే పీరియడ్ ఫిలిం చేయనున్నాడు.