Begin typing your search above and press return to search.
మిస్టర్ ఆంధ్రా.. హీరో అయ్యాడు
By: Tupaki Desk | 29 Jun 2015 6:02 AM GMTఇప్పుడొస్తున్న హీరోల్ని చూస్తే.. ఎవరైనా హీరో అవ్వొచ్చు. అందం, చందం, రంగు, ఒడ్డు, పొడవు అక్కర్లేదు. ప్రేక్షకుడిని ఒప్పిస్తే చాలు. నటనలో నరుక్కొస్తాడు అన్న ధీమా ఇస్తే చాలు.. కనీసం విశాల్, సునీల్, కార్తీలా ఉన్నా హీరో అయిపోవచ్చు. కానీ ఇలాంటి అవసరమేదీ లేకుండా ముందే అందగాడు అని నిరూపించుకున్న ఓ కుర్రాడు టాలీవుడ్‌లో ప్రవేశిస్తున్నాడు.
పేరు ఎబి రామ్ వర్మ. మిస్టర్ ఆంధ్రప్రదేశ్ -2013 కాంపిటీషన్‌లో కిరీటం అందుకున్నాడు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో 'హోరా హోరీ' అనే చిత్రంలో నటిస్తున్నాడు. అసలు ఈ అవకావం ఎలా వచ్చింది? అన్న ప్రశ్నకు ఎబి రామ్ ఏం చెప్పాడంటే.. 'ఒక వాణిజ్య ప్రకటన కోసం తేజ నటీనటుల్ని వెతుకుతున్నారు అని తెలిసి ఫోటోలు పంపించాను. ఆ తర్వాత ఓ ఆరేడు రౌండ్లు నన్ను పరీక్షించి హీరోగా ఎంపిక చేసుకున్నారని తెలిపాడు. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే.. అంతకంటే ముందే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించిన చరిత్ర ఉంది. ఒక సినిమాలో నటించాను కూడా.. అంటున్నాడు.
కాని ఆ తరువాత ఇంట్లోవాళ్లు వద్దనడంతో అమెరికా వెళ్లిపోయి ఎంబిఎ పూర్తి చేశాడట. అయినా నటన అనే పిచ్చి అంత తేలిగ్గా వదలదు కదా! దాంతో నటనకు సంబంధించి డిప్లోమా పూర్తి చేసి, దేవదాస్ కనకాల ఇనిస్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకుని, ఇప్పుడు హోరా హోరీలో ఓ చెడ్డ పోలీసుగా నటిస్తున్నాడు. తేజ దర్శకత్వంలో అవకాశం రావడం నా అదృష్టం. ఎందరో గొప్ప హీరోల్ని పరిశ్రమకి అందించారాయన అంటూ రామ్ చెప్పాడు.