Begin typing your search above and press return to search.

స్వాతంత్య్రాన్ని పబ్లిసిటీకి వాడుకుంటారా?

By:  Tupaki Desk   |   15 Aug 2015 6:02 PM GMT
స్వాతంత్య్రాన్ని పబ్లిసిటీకి వాడుకుంటారా?
X
మా సినిమా షూటింగ్‌ పూర్తయింది... అని చెప్పడానికి 'స్వాతంత్య్ర దినోత్సవాన్ని' ఉపయోగించుకోవాలా? పబ్లిసిటీలో ఈ పవిత్రమైన దినాన్ని ముడిపెట్టడమేంటి? ఇదీ ఫిలింనగర్‌ లో లేటెస్ట్‌ హాట్‌ టాపిక్‌. ఇదంతా ఓ సినిమా పోస్టర్‌ గురించి. ఈరోజు రిలీజ్‌ చేసిన 'అబ్బాయితో అమ్మాయి' పోస్టర్‌ సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఎర్ర బస్సు కిటికీలోంచి బైటికి వంగి మరీ లవర్‌ని ముద్దాడేస్తున్నాడు హీరో. పైగా లిప్‌ కిస్‌ లాగించేస్తున్నాడు. హీరో (నాగశౌర్య), హీరోయిన్‌ (కొత్తమ్మాయ్‌) ఎవరనేది దాచేసి క్యూరియాసిటీ పెంచాలనుకున్నారు.

ఇలాంటి పోస్టర్‌ పై 'ఇండిపెండెన్స్‌ డే విషెస్‌' అంటూ అదేదో గౌరవ సూచిక అన్నట్టు ట్యాగ్‌ లైన్‌ వేయడం దేశభక్తి అనుకోవాలా? సరే! పబ్లిసిటీ కోసమే ఇదంతా అని ఎవరికి వారు సర్ధి చెప్పుకోవాల్సిందే. కనీసం ఈరోజు స్వాతంత్య్ర దినోత్సవం అని సదరు ఫిలింమేకర్స్‌ గుర్తుంచుకున్నందుకు అందరూ సంతోషించాలి. ఈ సినిమా దర్శకుడు రమేష్‌ వర్మ ఆలోచన క్రియేటివ్‌ గా ఉందని పొగడాలి. అతడొక్కడే కాదు.. వీలున్నంత మంది సెలబ్రిటీలు స్వాతంత్య్ర దినోత్సవాన్ని వ్యక్తిగత ప్రచారానికి ఉపయోగించుకోవడం వెరీ శాడ్‌.