Begin typing your search above and press return to search.

జాతీయ అవార్డుల్లో ఇంత పెద్ద పొరపాటా

By:  Tupaki Desk   |   13 April 2018 11:45 AM GMT
జాతీయ అవార్డుల్లో ఇంత పెద్ద పొరపాటా
X
ఏ విషయంలో అయినా ఏమరుపాటుగా ఉండవచ్చు కాని జాతీయ అవార్డులు లాంటి ప్రతిష్టాత్మకమైన పురస్కారాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్త అవసరం. కానీ బాహుబలి 2 విషయంలో పొరపాటు చేసిన కమిటీ పలు సందేహాలను లేవనెత్తుతోంది. బాహుబలి 2 గాను యాక్షన్ సీన్స్ కంపోజ్ చేసినందుకు బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ కింద అబ్బాస్ అలీ మొఘల్ పేరు బ్రాడ్ కాస్టింగ్ మినిస్ట్రీ అధికారికంగా ప్రకటించింది. నిజానికి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అతను బాహుబలి 2 కాదు కదా బాహుబలి ది బిగినింగ్ కూడా పని చేయలేదు. దీనికి స్టంట్స్ చేసింది పీటర్ హైన్. రాజమౌళితో పీటర్ అనుబంధం మగధీర టైం నుంచే ఉంది. బాహుబలి దాకా అలాగే కొనసాగుతోంది కూడా. ఈ అబ్బాస్ అలీ ప్రఖ్యాత హింది స్టంట్ మాస్టర్ అయినప్పటికీ ఆయన బాహుబలికి అసలు వర్క్ చేయలేదు. ఆ మేరకు బాహుబలి 2 నిర్మాత శోభు యార్లగడ్డ తన ట్విట్టర్ లో మెసేజ్ పోస్ట్ చేసారు.

చాలా జాగ్రత్తగా రూపొందించాల్సిన లిస్ట్ లో ఇలా పొరపాటు చేయటం ఈజీగా వదిలేయదగ్గది కాదు. మనకే ఇలా అనిపిస్తే బాహుబలికి పగలనక రాత్రనక కష్టపడిన పీటర్ హైన్స్ కు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. స్వయంగా నిర్మాత ట్వీట్ చేసాక కాని విషయం అందరికి అర్థం కాలేదు. ఇక్కడ మరో సందేహం కూడా తలెత్తుతోంది. ఒకవేళ వేరే సినిమాకు గాను అబ్బాస్ కు అవార్డు ఫిక్స్ చేసి బాహుబలి 2 పేరు పొరపాటుగా ఉంచారా లేక పీటర్ హైన్స్ బదులు అబ్బాస్ అలీ పేరు వచ్చిందా అని. ఏదైతేనేం ఇలాంటి సంఘటనలు ఒకోసారి విశ్వసనీయత మీద ప్రభావం చూపుతాయి. తమకు కూడా న్యాయంగా రావాల్సిన అవార్డు ఇలాంటి తప్పుల వల్ల మిస్ అయ్యిందేమో అని భావించే వాళ్ళు లేకపోలేదు.