Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ : అబ్బాయితో అమ్మాయి
By: Tupaki Desk | 1 Jan 2016 10:35 AM GMTచిత్రం : అబ్బాయితో అమ్మాయి
నటీనటులు: నాగశౌర్య - పల్లక్ లల్వాని - రావు రమేష్ - మోహన్ - తులసి - ప్రగతి - షకలక శంకర్ - మధునందన్ - తేజస్వి తదితరులు
సంగీతం: ఇళయరాజా
కెమెరా: శ్యామ్ కె.నాయుడు
నిర్మాతలు: వందన అలేఖ్య జక్కం - కిరీటి పోతిని - శ్రీనివాస్ సమ్మెట
కథ - స్క్రీన్ ప్లే - మాటలు - పబ్లిసిటీ - దర్శకత్వం: రమేష్ వర్మ
అబ్బాయితో అమ్మాయి.. ఈ మధ్య కాలంలో కేవలం పోస్టర్లతోనే జనాల్ని ఆకర్షించిన సినిమా. దర్శకుడిగా తన ట్రాక్ రికార్డు ఎలా ఉన్నప్పటికీ పబ్లిసిటీ డిజైనర్ గా తనకున్న అనుభవంతో అందమైన పోస్టర్లు తయారు చేసి జనాలకు వల విసిరాడు రమేష్ వర్మ. మరి పోస్టర్లలో ఉన్న అందం సినిమాలో ఎంత ఉంది? అబ్బాయితో అమ్మాయి ఏమాత్రం ఆకట్టుకుంది? చూద్దాం పదండి.
కథ:
అభి (నాగశౌర్య), ప్రార్థన (పల్లక్ లల్వాని) ఫేస్ బుక్ లో మారు పేర్లతో పరిచయమై మంచి స్నేహితులవుతారు. ఆ ఆన్ లైన్ స్నేహం అలా కొనసాగుతుండగా.. ఇక్కడ ఆఫ్ లైన్లో ఒకరినొకరు చూస్తారు. అభి చాలా ప్లాన్లు వేసి ప్రార్థను ప్రేమలోకి దించుతాడు. తర్వాత ఇద్దరూ కలిసి వయసు ప్రభావంతో తప్పు చేస్తారు. కానీ అది వాళ్ల తల్లిదండ్రులకి తెలిసి మండిపడతారు. ఆ సమయంలోనే అభి తననెలా మోసం చేసింది ప్రార్థనకు. దీంతో ఆమె అతణ్ని అసహ్యించుకుంటుంది. నిజ జీవితంలో విడిపోయిన వీళ్లిద్దరూ ఫేస్ బుక్ లో మాత్రం ఒకరినొకరు చూసుకోకుండా తమ స్నేహాన్ని కొనసాగిస్తారు. మరి ఆ స్నేహం ఎంతవరకు వెళ్లింది.. చివరికి వీళ్లిద్దరూ కలిశారా లేదా అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
హీరో-హీరోయిన్ ఫేస్ బుక్ పరిచయంతో వాయిస్ కాల్స్ మాట్లాడేస్తారు. ఇద్దరూ ఒకరికొకరు ఫోన్లు కూడా చేసుకుంటారు. అలాగే ఆఫ్ లైన్లో ఇద్దరూ కలిసి ప్రేమాయణం సాగిస్తారు. ఐతే ఫేస్ బుక్ పరిచయంతో ఫోన్లు చేసి మాట్లాడుకుంటోంది కూడా తామిద్దరమే అని మాత్రం తెలియదట. ఫోన్లో వాయిస్ వేరేగా ఉంటుంది అనుకుందాం అన్నా ఇద్దరూ ప్రేమికులుగానూ ఫోన్లు చేసి మాట్లాడేసుకుంటారు. కానీ ఒకరినొకరు గుర్తుపట్టకపోవడమేంటో? రమేష్ వర్మ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యాడో మరి. సినిమా అన్నాక ప్రతి విషయంలోనూ లాజిక్కులు వెతక్కూడదు కరెక్టే. కానీ మూల కథే ఈ లాజిక్కుతో ముడిపడ్డపుడు ఇక పట్టించుకోకుండా ఎలా ఉంటాం. ప్రతి సన్నివేశంలోనూ ఈ లాజిక్ మనసును తొలిచేస్తుంటే ఇక కథనంతో ఎలా కనెక్టవుతాం?
రమేష్ వర్మ సహజంగా పబ్లిసిటీ డిజైనర్ కావడం వల్ల కాబోలు.. తెరమీద కనిపించే ప్రతి చిన్న వస్తువు కూడా చాలా అందంగా ఉండేలా చూసుకున్నాడు. హీరోయిన్ వేసుకునే చెవి దిద్దుల దగ్గర్నుంచి హీరో వాడే ల్యాప్ టాప్ కవర్ వరకు వరకు అన్నీ ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు. ఇక నటీనటుల కాస్ట్యూమ్స్ కానివ్వండి.. లొకేషన్లు కానివ్వండి.. సెట్టింగ్స్, అందులో ప్రాపర్టీస్ కానివ్వండి.. అన్నీ చాలా రిచ్ గా కనిపిస్తాయి. ప్రతి సన్నివేశంలోనూ కెమెరా పనితనం కూడా తోడై.. తెరంతా చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. కానీ ఈ అదనపు హంగులే సినిమాను కాపాడేయలేవు కదా. ముందు ప్రేమకథలో ఫీల్ ఉంటే.. ఇవన్నీ ఆ ఫీల్ ను మరింత పెంచుతాయి తప్పితే.. కేవలం ఈ హంగులే ప్రేమకథను పండించేయలేవు కదా.
రమేష్ వర్మ అసలు విషయం మీద శ్రద్ధ పెట్టకుండా తన ఫోకస్ అంతా ఈ హంగుల మీదే పెట్టాడు. అసహజంగా అనిపించే కథా కథనాలు.. పాత్రలు.. సినిమాకు మైనస్. సినిమాలో ప్రతి క్యారెక్టరూ అసహజంగా ప్రవర్తిస్తుంది. హీరోయిన్ తనకు ముద్దు పెట్టిందని హీరో చెబితే తండ్రి పార్టీ ఇవ్వడం.. మళ్లీ హీరో హీరోయిన్ తో రొమాన్స్ కూడా చేశానని తండ్రికి వచ్చి చాలా ఉత్సాహంగా చెప్పడం.. అంతకుముందంతా లైట్ అన్నట్లు ఉన్న హీరో తండ్రి ఒక్కసారిగా సీరియస్ అయి చెంప చెల్లుమనిపించడం.. మొదట్నుంచి వయొలెంటుగా ఉండే హీరోయిన్ తండ్రి హీరో తనని కాపాడగానే మరీ కామెడీ పీస్ లా మారిపోయి లవ్ గురు అవతారమెత్తడం.. హీరోయిన్ని హీరో ఫ్యామిలీ, హీరోను హీరోయిన్ ఫ్యామిలీ ఓన్ చేసేసుకుని.. తమ పిల్లల్ని మాత్రం దూరం పెట్టడం.. ఇలా చాలా వ్యవహారాలు అసహజంగానే అనిపిస్తాయి.
అసలు హీరో హీరోయిన్ల ప్రవర్తనే చిత్రంగా ఉంటుంది. ఇద్దరూ ఓ అండర్ స్టాండింగ్ తోనే తప్పు చేసినట్లు కనిపిస్తారు. కానీ తర్వాత నింద మొత్తం హీరో మీద పడుతుంది. హీరోను హీరోయిన్ మరీ అంతలా అసహ్యించుకోవడానికి సరైన రీజన్ కనిపించదు. నిజ జీవితంలో సిల్లీగా ప్రవర్తించే హీరో హీరోయిన్లు.. ఫేస్ బుక్ స్నేహితులుగా మాత్రం చాలా మెచ్యూరిటీ చూపించేస్తుంటారు. ఈ తరం అమ్మాయిలు, అబ్బాయిలకు ఆన్ లైన్లో ఉన్నంత మెచ్యూరిటీ.. నిజ జీవితంలో ఉండదేమో అని చెప్పాలన్నది దర్శకుడి ఉద్దేశమో ఏంటో మరి.
ప్రథమార్ధంలో హీరో హీరోయిన్ల లవ్ స్టోరీ వరకు సినిమా ఓ మోస్తరుగా సాగుతున్నట్లే అనిపిస్తుంది కానీ.. ఇక వాళ్లిద్దరి మధ్య గొడవ మొదలై విడిపోయాక మాత్రం తలా తోకా లేకుండా సాగుతుంది. ద్వితీయార్ధంలో ‘డ్రామా’ మరీ ఎక్కువైపోయింది. ఫేస్ బుక్ ఫ్రెండుగా దగ్గరవుతూ నేరుగా హీరోయిన్ కు దూరమవుతూ హీరో పడే ఆవేదనలోంచి ఎమోషన్ పిండేద్దామని రమేష్ వర్మ ప్రయత్నించాడు. ఐతే ఇక్కడ ఎమోషన్ పండక నాటకీయత మరీ ఎక్కువైపోయి అసహనం మాత్రమే కలుగుతుంది. హీరోయిన్ స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇచ్చే సీన్లో ‘రాజా’ను.. క్లైమాక్స్ లో ఎయిర్ పోర్ట్ సీన్ ‘తొలి ప్రేమ’ను గుర్తుకు తెస్తాయి. కానీ ఆ సినిమాల్లో ఉన్న ఫీల్, ఎమోషన్ కొంచెమైనా తీసుకురాలేకపోయాడు రమేష్ వర్మ.
నటీనటులు:
నాగశౌర్య అందంగా కనిపించాడు. దర్శకుడు చెప్పినట్లు నటించాడు. ఎమోషనల్ సీన్స్ లో బాగానే చేశాడు. ఐతే కొన్ని సన్నివేశాల్లో అవసరానికి మించి మెచ్యూరిటీ, ఇమ్మెచ్యూరిటీ చూపించాడు. శౌర్యతో పోలిస్తే పల్లక్ లల్వాని అంత అందంగా లేదు. కొన్నిసార్లు బావుందనిపిస్తుంది. కొన్నిసార్లు ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. నటన పర్వాలేదు. రావు రమేష్ ఓవర్ యాక్షన్ చేసి తన కెరీర్ తొలి రోజుల్ని గుర్తుకు తెచ్చాడు. చాన్నాళ్ల తర్వాత తెలుగులో నటించిన ‘మౌనరాగం’ మోహన్ పాత్రలో చెప్పుకోదగ్గ విశేషం లేదు. తులసిది కూడా రావు రమేష్ లాగే అతి నటనలా అనిపిస్తుంది. బహుశా ఇదంతా దర్శకుడి ఆలోచనల మేరకే కావచ్చు. ప్రగతి బాగానే చేసింది. కానీ డైలాగులు చెప్పడంలో ఆమె వయ్యారం కూడా అతిగానే అనిపిస్తుంది. మిగతా వాళ్లంతా మామూలే.
సాంకేతిక వర్గం:
‘అబ్బాయితో అమ్మాయి’లో టెక్నీషియన్స్ పనితనం కనిపిస్తుంది. ముందు ఆర్ట్ డైరెక్షన్ గురించి ప్రస్తావించాలి. దాదాపుగా ప్రతి సన్నివేశంలోనూ ఈ విభాగం పనితనం కనిపిస్తుంది. కెమెరామన్ శ్యామ్ కె.నాయుడు కూడా ప్రతి సన్నివేశాన్నీ అందంగా చూపించాడు. పాటల చిత్రీకరణ కూడా బాగుంది. ఇళయరాజా సంగీతం ఆయన స్థాయికి తగ్గట్లు లేదు. రెండు పాటలు బావున్నాయి. ఐతే నేపథ్య సంగీతం మాత్రం ఇళయరాజానే చేశాడంటే నమ్మకం కలగదు. ఆయన ప్రత్యేకతేమీ కనిపించలేదు అందులో. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. కొత్త నిర్మాతలైనా బాగా ఖర్చు చేశారు. ఇక దర్శకుడు రమేష్ వర్మ సినిమాకు అన్నీ తానై వ్యవహరించి బాగానే కష్టపడ్డాడు కానీ.. రాతలో అతని బలహీనత సినిమా అంతా కనిపిస్తుంది. మంచి స్క్రిప్టు ఇస్తే దాన్ని అందంగా తెరకెక్కించగలడన్న ఫీలింగ్ కలుగుతుంది కానీ.. రైటింగ్ లో మాత్రం అతను చాలా వీక్ అన్న సంగతి అడుగడుగునా తెలిసిపోతుంది. ‘‘నేను లవ్వుకు స్టవ్వు లాంటోణ్ని. మంట పెడితే వంట అయిపోవాల్సిందే’’ అని ఓ డైలాగ్ ఉంది సినిమాలో. ఇది రమేష్ విరచితమేనేమో. ఈ డైలాగ్ ఎంత కృత్రిమంగా అనిపిస్తుందో సినిమా కూడా అలాంటి ఫీలింగే కలిగిస్తుంది.
చివరగా: అందమైన ఫ్రేమ్ లో అసహజ ప్రేమ కథ
రేటింగ్- 2/5