Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్ : అల్లు ఫన్ రైడ్
By: Tupaki Desk | 15 April 2019 4:00 AM GMTస్టైలిష్ స్టార్ తమ్ముడిగా కాక తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ కోసం కష్టపడుతున్న అల్లు శిరీష్ కొత్త సినిమా ఏబిసిడి (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) ట్రైలర్ ఇందాకా విడుదలయింది. రుక్షర్ ధిల్లాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఇక వీడియోలోని విషయానికి వస్తే కథ గురించి క్లారిటీ ఇచ్చేశారు.
అమెరికాలో పుట్టి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన అవి(అల్లు అర్జున్)పెద్ద వ్యాపారవేత్త(నాగబాబు)వారసుడు. ఏదో కారణం వల్ల ఇండియాకు రావాల్సి వస్తుంది. ఓ స్నేహితుడి(భరత్)తో కలిసి ఇక్కడ సగటు మధ్య తరగతి కష్టాలను చవి చూడటం మొదలుపెడతాడు. ఈ క్రమంలోనే రూపాయి విలువ బాగా తెలిసివస్తుంది.
మరోవైపు ఇక్కడే ఓ లవర్(రుక్షర్)కూడా దొరికేస్తుంది. అంతా బాగుంది అనుకుంటున్న
తరుణంలో అవి ఓ రాజకీయ చక్రవ్యూహంలో అడుగు పెట్టాల్సి వస్తుంది. సరదాగా గడిచిపోతున్న యువకుడి జీవితం అసలు ఇన్ని మలుపులు ఎందుకు తీసుకుంది చివరికి ఏ గమ్యం చేరుకుంది తెలుసుకోవడమే ఏబిసిడి
అల్లు శిరీష్ అవి పాత్రను చాలా ఈజ్ తో చేశాడు. తన బాడీ లాంగ్వేజ్ కు పర్ఫెక్ట్ గా సూటయ్యే పాత్ర కావడంతో పాటు పెర్ఫార్మన్స్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా మనకు బాగా సుపరిచితుడైన మాస్టర్ భరత్ ఇందులో గెడ్డం మీసంతో యువకుడిగా సర్ప్రైజ్ ఇవ్వడమే కాదు మరో టాలెంటెడ్ ఆర్టిస్ట్ దొరికాడన్న నమ్మకం కలిగించాడు.
నాగబాబు-కోట-శుభలేఖ సుధాకర్ ఇలా సీనియార్టీ ఆర్టిస్టులు అండగా నిలిచారు. వెన్నెల కిషోర్ కామెడీ కూడా తోడయ్యింది. జూదా శాండీ సంగీతం రామ్ సినిమాటోగ్రఫీ అన్ని సినిమా మూడ్ ని చక్కగా క్యారీ చేశాయి. కళ్యాణ్ రాఘవ్ సంభాషణలు పేలాయి. మొత్తానికి అంచనాలు రేపడంలో ఏబిసిడి టీమ్ మొదటి అడుగును విజయవంతంగా వేసేసింది