Begin typing your search above and press return to search.

ఫిల్మ్ ఫేర్ కాదు ఫ్యామిలీ ఫేర్ అవార్డులు.. సిగ్గులేకుండా చేశారు..!

By:  Tupaki Desk   |   20 Jun 2020 12:30 AM GMT
ఫిల్మ్ ఫేర్ కాదు ఫ్యామిలీ ఫేర్ అవార్డులు.. సిగ్గులేకుండా చేశారు..!
X
హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటన సినీ పరిశ్రమలో విషాదం నింపింది. ఇండస్ట్రీలోని కొందరు పెద్దవాళ్ళ కారణంగా తాము తక్కువ చేయబడుతున్నామని భావిస్తున్న కొంతమంది బాలీవుడ్ ప్రముఖుల మనస్తత్వంలో మార్పులు తీసుకొస్తుంది. ఇప్పటివరకు దర్శకుడు అభినవ్ కశ్యప్, సింగర్ సోనునిగమ్ ఈ విషయం పై నోరువిప్పారు. తాజాగా మరో వ్యక్తి కూడా బయటికి వచ్చి మాట్లాడారు. ఆయనే హీరో అభయ్ డియోల్. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో అభయ్ తన ‘జిందగీ నా మిలేగి దోబారా’ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తను ఒత్తిడికి గురైనప్పుడల్లా ఆ సినిమాను చూస్తానని, చూసిన ప్రతిసారి గొప్ప అనుభవమేనని అన్నారు. కానీ అదే పోస్టులో.. అభయ్ ‘ఫిలింఫేర్ అవార్డులను ఫ్యామిలీ ఫేర్ అవార్డులు' అని పిలిచాడు. నెటిజన్లు ఈ మాటను బాగా ట్రోల్ చేస్తున్నారు.

అభయ్ డియోల్ ఈ సినిమా టైంలో ఫిలింఫేర్ అవార్డుకు సపోర్టింగ్ యాక్టర్ గా నామినేట్ అయ్యాడు. కాని ఈ సినిమాలో ముగ్గురు హీరోలు ఉండటంతో.. "దాదాపు అన్ని అవార్డు ఫంక్షన్లు నన్ను, ఫర్హాన్‌ను సపోర్టింగ్ క్యారెక్టర్లు గానే నామినేట్ చేశాయి. కానీ హృతిక్.. కత్రినా కైఫ్ లను మాత్రం లీడ్ యాక్టర్లుగా ఎంపిక చేశారు. అందుకే ఇండస్ట్రీ దృష్టిలో.. ఇది ఒక అమ్మాయి అబ్బాయిల లవ్ మూవీ. అబ్బాయి తీసుకునే ఏ నిర్ణయాలకైనా అతని స్నేహితులు మద్దతు ఇస్తారు" అని అభయ్ తెలిపారు. అభయ్ అవార్డుల జ్యూరీని కూడా వదలలేదు. "ఇండస్ట్రీలోని పెద్దలకు వ్యతిరేకించడానికి చాలానే రహస్య.. బహిరంగ మార్గాలు ఉన్నాయి. కానీ ఈ సినిమాకి సంబంధించి సిగ్గులేకుండా బహిరంగానే తప్పు చేశారు. నేను హుందాగానే అవార్డులను బహిష్కరించాను. కాని ఫర్హాన్ దానితో బాగానే సరిపెట్టుకున్నాడు”అని అభయ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం అభయ్ మాటలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. చూడాలి మరి ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో..!