Begin typing your search above and press return to search.

దేశంలో సమస్యల పై సెలబ్రిటీలు ఎందుకు ప్రశ్నించడం లేదు?

By:  Tupaki Desk   |   6 Jun 2020 2:00 PM GMT
దేశంలో సమస్యల పై సెలబ్రిటీలు ఎందుకు ప్రశ్నించడం లేదు?
X
మనదేశంలో జరుగుతున్న అన్యాయాలను పట్టించుకోవడం మానేసి ఇతర దేశాలలో జరుగుతున్న అన్యాయాల గురించి బాగానే స్పందిస్తున్నారు మనదేశ సెలబ్రిటీలు. కరోనా వలన దేశంలో సామాన్యుల నుండి సినీతారలు.. రాజకీయ నాయకులు.. బడా వ్యాపారవేత్తలు ఇలా ఇంతమంది ఉన్నారు. రోజురోజుకి దేశంలో మహమ్మారి విజృంభిస్తూ చుక్కలు చూపిస్తుంది. కానీ ఎవరో ఒకరు తప్ప మిగిలిన వారెవరు స్పందించడం లేదు. ఇటీవల నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ పై అమెరికా పోలీసుల అమానుష ప్రవర్తనకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా అన్నీ దేశాలలో నిరసనలు మిన్నంటుతున్నాయి. మనదేశంలోని సినీతారలంతా.. అమెరికా ఘటన పై స్పందిస్తూ వర్ణ వివక్షను వీడాలని ట్వీట్లు పెడుతున్నారు. అయితే వేరే దేశంలో ఉన్న అమెరికా నల్లజాతీయులకు మన సినీతారలు అండగా ఉండటం బాగానే ఉంది.. కానీ మనదేశంలో జరుగుతున్న అన్యాయాలపై మాత్రం నోరు మెదపకుండా.. గొంతెత్తి ప్రశ్నించకుండా ఎందుకు ఇలా చేస్తున్నారని సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది.

అయితే బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్.. తాజాగా బాలీవుడ్ సినీతారల పై కొన్ని సూటి ప్రశ్నలు సంధించాడు. ‘మనకు మనదేశంలోని వలస కార్మికుల జీవితాలు ముఖ్యమే. మైనారిటీల జీవితాలు కూడా అంతే ముఖ్యం. మరి పేదల జీవితాల గురించి అంటారా.. వారి పై కూడా మనకు పట్టింపు ఉండాలి. ఇప్పుడిప్పుడే మేల్కొంటున్న భారతీయ సినీ సెలబ్రిటీలారా.. ఎక్కడో అమెరికాలో జరుగుతున్న జాత్యహంకారానికి వ్యతిరేకంగా మద్దతు తెలుపుతున్నారు.. కానీ మన సొంత పెరట్లో జరిగే అన్యాయాలు మాత్రం మీకు కనబడవు కదా.." అన్నట్లు అభయ్ కాస్త ఘాటుగా ప్రశ్నించాడు. అభయ్ అభిప్రాయానికి సోషల్ మీడియాలో భారీ ఎత్తున మద్దతు పలుకుతున్నారు నెటిజన్లు. అంతేగాక.. ప్రస్తుతం అభయ్ సోషల్‌ మీడియా ద్వారా ఫెయిర్‌నెస్‌ క్రీం ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఓ క్యాంపెయిన్‌ కూడా నడిపిస్తున్నాడు. ‘ఇండియన్ సినీ సెలబ్రిటీలు ఇప్పటికైనా ఫెయిర్‌నెస్‌ క్రీముల ప్రకటనల్లో నటించడం మానేస్తే బాగుంటుందని’ సోషల్ మీడియా ద్వారా ఓ విషయం బయటికి తెచ్చారు. ఆయన వ్యతిరేకతకు ఉదాహరణలు కూడా చూపిస్తున్నాడు అభయ్. ఆయన ఫెయిర్ నెస్ క్రీంలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న కొందరి బాలీవుడ్ స్టార్స్ పై ఇండైరెక్ట్ గా ఈ ప్రశ్నలు సంధించాడని ఆలోచిస్తే అర్థం అవుతుంది.