Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ కు సర్ ప్రైజ్ బర్త్ డే విషెస్!
By: Tupaki Desk | 20 May 2018 5:42 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు 35వ పుట్టినరోజు జరుపుకోబోతున్నాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు ఇండస్ట్రీలోని సెలబ్రిటీల నుంచి అభిమానుల వరకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే, ఈ సారి బర్త్ డేకి ఎన్టీఆర్ కు మొదటి విషెస్ చెప్పి సర్ ప్రైజ్ చేశారో స్పెషల్ పర్సన్. ఎన్టీఆర్ ముద్దుల కొడుకు అభయ్ రామ్..ఎన్టీఆర్ కు ఫస్ట్ విషెస్ చెప్పి సర్ ప్రైజ్ చేశాడట. గత ఏడాదిలాగే అభయ్ రామే ఫస్ట్ బర్త్ డే విషెస్ తెలియజేశాడట. ఈ విషయాన్ని ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే, గత ఏడాది లాగా కాకుండా ఈ సారి ఎన్టీఆర్ కళ్లు మూయకుండా....అభయ్ కూడా ఫొటోకు ఎంచక్కా పోజు ఇచ్చాడట. `ఎట్టకేలకు.. అభయ్ నా కళ్లు మూయడం ఆపేశాడు. అభయ్ పెద్దవాడవుతున్నాడు. అయినప్పటికీ ఎప్పటిలా నాకు మొదట బర్త్డే విషెస్ చెప్పాడు` అని ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ తోపాటు అభయ్ కూడా స్టిల్ ఇచ్చిన ఫొటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కొద్ది రోజులుగా టాలీవుడ్ లో హీరోలు సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో మాదిరికాకుండా ఒకరి సినిమా వేడుకలకు, ప్రారంభోత్సవాలకు మరొకరు హాజరు కావడం....వారి పుట్టిన రోజు, పెళ్లి రోజులకు శుభాకాంక్షలు తెలపడం వంటివి చేస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నారు. తమ అభిమాన హీరోలు కలిసి మెలిసి ఉండడంతో ఫ్యాన్స్ మధ్య కూడా స్నేహపూర్వకవాతావరణం ఏర్పడింది. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతోన్న `అరవింద సమేత వీర రాఘవ` చిత్రం ప్రారంభోత్సవానికి పవన్ కల్యాణ్ హాజరై అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. ఆ తర్వాత హీరో రామ్ చరణ్, ఉపాసనలు ఎన్టీఆర్, ప్రణతి దంపతులకు 7వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇపుడు తాజాగా ఎన్టీఆర్ 35వ పుట్టిన రోజును రామ్ చరణ్ ఫ్యాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ .....విజయవాడలో భారీ కేక్ కటింగ్ తో పాటు, ఉచితంగా మజ్జిగను పంపిణీ చేయనున్నారు. మరోవైపు హైదరాబాద్ లో మీడియా మిత్రులకు చరణ్ ఫ్యాన్స్ ఓ లగ్జరీ హోటల్ లో గ్రాండ్ పార్టీని ఇవ్వబోతున్నారు. దీంతోపాటు ఇరు రాష్ట్రాల్లో చరణ్ ఫ్యాన్స్....ఎన్టీఆర్ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. రాజమౌళి చిత్రంలో నటించబోతోన్న సందర్భంగా ఏర్పడిన ఎన్టీఆర్- చెర్రీల స్నేహబంధాన్ని....వారి ఫ్యాన్స్ కంటిన్యూ చేస్తున్నారు. టాలీవుడ్ లో మొదలైన ఈ నయా ట్రెండ్ ఇలాగే కొనసాగాలని ఆశిద్దాం.