Begin typing your search above and press return to search.

గొప్ప ప్రేమ‌క‌థలో లైంగిక వేధింపుల్ని స‌మ‌ర్థించారా?

By:  Tupaki Desk   |   20 Aug 2020 12:30 AM GMT
గొప్ప ప్రేమ‌క‌థలో లైంగిక వేధింపుల్ని స‌మ‌ర్థించారా?
X
తన సినిమా కథ‌లోలానే నిజజీవితంలో కూడా తనకిష్టమైన అమ్మాయికోసం ఏం చేసేందుకైనా సిద్దపడ్డానని స్టార్ హీరో ధ‌నుష్ ఓ సంద‌ర్భంలో తెలిపాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధ‌నుష్ కి బాలీవుడ్ లో తొలి ప్ర‌య‌త్న‌మే అసాధార‌ణ ఫాలోయింగ్ ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. రాంజానా కథాంశం అందులో అత‌డి పాత్ర‌ ఆస‌క్తిక‌ర‌మైన‌వి. ఓవైపు విప్ల‌వం.. మ‌రోవైపు స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌ను ద‌ర్శ‌కుడు ఆనంద్ ఎల్.రాయ్ అద్భుతంగా ఆవిష్క‌రించారు. ఇందులో అమాయకత్వం నిండిన ప్రేమికుడిగా త‌న‌దైన‌ మాటతీరుతో ధనుష్ బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమా బంప‌ర్ హిట్ కొట్ట‌డ‌మే గాక ధ‌నుష్ కి గొప్ప పేరును తెచ్చింది.

ఇక ఇదే సినిమాలో సోన‌మ్ క‌పూర్ ధ‌నుష్ ప్రేమ‌లో సంఘ‌ర్ష‌ణ ఆస‌క్తిక‌రం. అలాగే అభ‌య్ డియోల్ ఓ ఆస‌క్తిక‌ర పాత్ర‌లో న‌టించాడు. అయితే రాంజానా గురించి ప్ర‌స్థావిస్తూ అభయ్ డియోల్ సోషల్ మీడియాలో తాజాగా ఒక సుదీర్ఘ సందేశాన్ని పంచుకున్నాడు. అతను ఆనంద్ ఎల్. రాయ్ రాంజానా ఒక రిగ్రెసివ్ చిత్రం అని స్పష్టంగా పేర్కొన్నాడు.

ఇన్ స్టాగ్రామ్ లో ఒక‌ యూజర్ సందేశాన్ని డియోల్ స్వ‌యంగా పంచుకున్నాడు. తన చిత్రం రాంజానాకు సంబంధించి ఒక‌ స్పష్టమైన అంతఃర దృష్టిని ట్యాగ్ చేశాడు. ప‌లు స‌న్నివేశాల్ని చూపించ‌డం ద్వారా ఈ మూవీలో లైంగిక వేధింపులను పొగిడారంటూ డియోల్ మూవీ రాంజానాపై అత‌డు ఆరోపణలు చేశాడు. ఈ చిత్రంలో ఫ‌లానా స‌న్నివేశం అంటూ ఎత్తి చూపిన వ్యక్తిగత బ్లాగర్ ఆ స్క్రీన్ షాట్ ను పంచుకుంటూ.. విమ‌ర్శించాడు. రాంజానా చిత్రానికి సంబంధించి ఓల్డ్ స్కూల్ రెబ‌ల్ నుండి ఇటువంటి స్పష్టమైన చెల్లుబాటు అయ్యే అంతర దృష్టి కోణ‌మిది. చరిత్ర దీనిని తిరిగి ఎప్ప‌టికీ చూడ‌దు. ఇది దశాబ్దాలుగా బాలీవుడ్ ‌లో ఒక ఇతివృత్తం (థీమ్ లా)గా ఉంది. ఇక్కడ (బాలీవుడ్ లో) ఒక అబ్బాయి ఒక అమ్మాయిని విడుదల చేసే వరకు ఏదైనా చేయగలడు. సినిమాలో మాత్రమే ఆమె దానిని ఉద్దేశపూర్వకంగా చేస్తుంది. వాస్తవానికి ఇది ఒక రకమైన లైంగిక హింసకు దారితీస్తుందని మనం మళ్లీ మళ్లీ చూశాం. తెరపై గొప్ప‌గా చూప‌డం అనేది బాధితురాలిని నిందించడానికి మాత్రమే దారితీస్తుంది`` అంటూ రంధ్రాన్వేష‌ణ చేశాడు.

అయితే అభ‌య్ డియోలో అది నిజ‌మేన‌ని అంగీక‌రించాడు. దీనికి యూజర్లు సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు అభయ్ డియోల్ ను ప్రశంసించారు. కొంతమంది లైంగిక వేధింపులను కీర్తించినందుకు ఈ చిత్ర నిర్మాతలను నిందించారు. రాంజానాకు ఆనంద్ ఎల్ రాయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రం 2013 లో విడుదలైంది.