Begin typing your search above and press return to search.

భన్సాలీపై దాడిని సమర్ధిస్తున్నాడు!

By:  Tupaki Desk   |   30 Jan 2017 7:03 PM IST
భన్సాలీపై దాడిని సమర్ధిస్తున్నాడు!
X
బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై రాజ్ పుత్ లు దాడి చేయడాన్ని సమర్ధిస్తున్నాడు బాలీవుడ్ గాయకుడు అభిజీత్ భట్టాచార్య. ఆ దాడిని సమర్ధించడమే కాకుండా, హిందీ పరిశ్రమపై మండిపడ్డాడు. తాజాగా ట్విట్టర్ లో సంజయ్ లీలా భన్సాలీపై దాడిని తాను సమర్ధిస్తున్నానని ప్రకటించాడు!! భన్సాలీ అనే కాదు హిందువులను ఎవరైనా అగౌరపరచాలని ప్రయత్నిస్తే ఈ స్థాయి దాడులు తప్పవని ప్రకటించాడు.

దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై దాడిని సమర్ధించిన అభిజీత్... ఇదే సమయంలో సినిమా పరిశ్రమపై కూడా పరుష పదజాలంతో విరుచుకుపడ్డాడు. బాలీవుడ్ లో హిందూ వ్యతిరేక శక్తులు రాజ్యమేలుతున్నాయని.. హిజ్రాలు, స్వలింగ సంపర్కులు హిందీ చిత్రపరిశ్రమలో ఆధిపత్యం చెలాయిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. అయితే.. ఇలా దూషణలకు దిగడం, నోరుపారేసుకోవడం అభిజీత్ కు ఇదేమీ కొత్తకాదు! గతంలో కూడా చాలాసార్లు ఇలానే నోరు పారేసుకున్న చరిత్ర అభిజీత్ సొంతం!

కాగా, రాజస్థాన్‌ లోని జైగడ్ కోట వద్ద పద్మావతి సినిమా షూటింగ్ సందర్భంగా సంజయ్ లీలా భన్సాలీపై రాజ్ పుత్ కర్నిసేన దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పద్మావతి గురించి తప్పుగా చూపిస్తున్నారంటూ ఘర్షణకు దిగిన కర్నిసేన సభ్యులు... షూటింగ్‌ కెమెరా, లైట్లు బద్దలుకొట్టడంతో పాటు డైరెక్టర్‌ భన్సాలీపైనా చేయిచేసుకున్నారు!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/