Begin typing your search above and press return to search.

పవన్ విలన్.. చీపురుతో చెత్త ఊడ్పించారు

By:  Tupaki Desk   |   31 Oct 2016 5:24 AM GMT
పవన్ విలన్.. చీపురుతో చెత్త ఊడ్పించారు
X
ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉన్న ఆర్టిస్టులు.. టెక్నీషియన్లలో చాలామంది ఒకప్పుడు ఎంతో స్ట్రగుల్ అయి వచ్చిన వాళ్లే. రామ్ గోపాల్ వర్మ ‘రక్తచరిత్ర’లో బుక్కా రెడ్డిగా.. పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’లో సిద్దప్పనాయుడిగా అద్భుత అభినయం ప్రదర్శించిన అభిమన్యు సింగ్ కూడా ఈ కోవకే చెందుతాడు. అతను కెరీర్ ఆరంభంలో చాలా కష్టాలే పడ్డాడు. బ్రేక్ కోసం చాలా స్ట్రగులయ్యాడు.

అభిమన్యుది బీహార్ రాజధాని పాట్నా. యుక్త వయసులోకి వచ్చినప్పటి నుంచి అతడికి నటన అంటే పిచ్చి. ఆ పిచ్చితోనే ముంబయికి వచ్చేశాడు. కానీ ఎంతగా ప్రయత్నించినా అవకాశాలు రాలేదు. అలాంటి టైంలో థియేటర్ గ్రూపులో చేరితే ప్రయోజనం ఉంటుందేమో అని.. మకరంద్ దేశ్ పాండే నడిపే థియేటర్ గ్రూప్ ‘అంశ్’లో చేరాడు. అందులో చేరాం కదా ఇక నటుడిగా స్థిరపడిపోయినట్లే అనుకున్నాడు అభిమన్యు. ఐతే అక్కడ జరిగింది వేరు.

ఆఫీసులోకి అడుగుపెట్టగానే మకరంద్.. చీపరందుకుని ఆఫీస్ ఊడ్చమని చెప్పాడట. అభిమన్యు కోపంతో రగిలిపోయాడట కానీ.. కెరీర్ కోసం కోపం అణుచుకుని చెప్పింది చేశాడట. కొన్నాళ్ల తర్వాత మకరంద్.. అభిమన్యును నటనలో తీర్చిదిద్దాడు. అయినా అవకాశాలైతే రాలేదు. కొన్నేళ్ల తర్వాత మనోజ్ బాజ్ పేయి పుణ్యమా అని.. రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా ‘అక్స్’లో పోలీస్ పాత్ర చేసే ఛాన్సొచ్చింది. ఐతే ఆ సినిమా ఫ్లాపవడంతో మళ్లీ ఖాళీ అయిపోయాడు. ఇంకొన్నాళ్లకు లక్ష్య్.. డోల్.. జన్నత్ లాంటి సినిమాలు చేశాడు. చివరికి ‘గులాల్’తో బ్రేకొచ్చింది. ఆపై ‘రక్తచరిత్ర’తో కెరీర్ మలుపు తిరిగింది. హిందీ సినిమాల్లో కంటే తెలుగులో బాగా పాపులరై.. ఇక్కడ విలన్ గా స్థిరపడ్డాడు అభిమన్యు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/