Begin typing your search above and press return to search.
ఆ హీరో వల్లనే లక్షల్లో వడ్డీ కట్టాను: స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 16 Jun 2020 4:30 PM GMTసినీ ఇండస్ట్రీలో అనుబంధం అనేది కొంతకాలమే బాగుంటుందని.. ఒకసారి మనస్పర్థలు వస్తే ఇక ఎదుటివారు శత్రువులలా చూసుకుంటారని కొన్ని సంఘటనలు వింటే అర్ధమవుతుంది. అయితే ఓ స్టార్ హీరో కుటుంబం తన పై పగబట్టారని ఓ సూపర్ హిట్ ఫిల్మ్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఆయన ఎవరో కాదు.. సల్మాన్ ఖాన్ తో దబాంగ్ సినిమా రూపొందించిన డైరెక్టర్ అభినవ్ కశ్యప్ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దబాంగ్ సినిమా తర్వాత తను ఏం చేసినా సల్మాన్ ఫ్యామిలీ అడ్డుకుందని.. దబాంగ్ తర్వాత రెండో సినిమా వేరే వాళ్లతో చేద్దామంటే ఆపారు.
అంతేగాక వయాకామ్ సంస్థతో చేతులు కలిపితే వారిని కూడా బెదిరించి అడ్డుకున్నారని.. అందుకు తను తీసుకొన్న రెమ్యునరేషన్ రూ.7 కోట్లతోపాటు 90 లక్షల వడ్డీతో కలిపి కట్టాల్సి వచ్చిందని అభినవ్ కశ్యప్ ఆరోపించారు. ఆ తర్వాత బేషరమ్ సినిమా విడుదలను ఆపేందుకు సల్మాన్ కుటుంబం ప్రయత్నించింది. సల్మాన్ పీఆర్వోలతో బేషరమ్ సినిమాపై నెగిటివ్ ప్రచారం చేయించారు. అంతే బేషరమ్ సినిమాను కొనడానికి డిస్టిబ్యూటర్లు భయపడి వెనక్కి వెళ్లిపోయారు. ఇక తను సల్మాన్ ఖాన్ ఫ్యామిలీపై పోరాటం చేయాలని నిర్ణయించుకొన్నట్లు తెలిపారు అభినవ్. ఆ తర్వాత సినిమా పై నెగిటివ్ ట్రోలింగ్ చేశారు. ఎన్ని కుట్రలు చేసినా విడుదలకు ముందే తన సినిమా 58 కోట్లు సంపాదించిందని అన్నారు.
అంతేగాక ఆ సినిమా శాటిలైట్ బిజినెస్‌ను కూడా చెడగొట్టారని.. కానీ రిలయన్స్ సంస్థకు ఉన్న క్రెడిట్ వలన శాటిలైట్ హక్కులు మంచి ధరకు అమ్ముడైనట్లు తెలిపారు. ఇక తన శత్రువులు ఎవరనేది బాగా తెలుసన్నారు. సలీమ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ ఎవరైనా గానీ అని లెక్కచేయలేదు. సల్మాన్ అక్రమ సంపాదనను అడ్డుపెట్టుకొని.. లేదా రాజకీయ అండ చూసుకొని, అండర్ వరల్డ్‌తో సంబంధాలు పెట్టుకొని నన్నే కాదు ప్రతీ ఒక్కరిని బెదిరిస్తారని డైరెక్ట్ గా బాంబ్ పేల్చారు అభినవ్. నేను పోరాడాను. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లాగా తను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేస్తూ.. తను ఎదుర్కొన్న సమస్యలను బయట పెట్టాడు డైరెక్టర్. మొత్తానికి బాలీవుడ్ ఇండస్ట్రీలోని అవినీతి ముసుగులో ఉన్న పెద్దల పై అభినవ్ ఎక్కు పెట్టారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.